»   » శ్రుతి హాసన్ పై నిషేధం : మేం లాస్ అవుతాం...వదిలేయండి

శ్రుతి హాసన్ పై నిషేధం : మేం లాస్ అవుతాం...వదిలేయండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'ఇలయ తలబది' విజయ్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'పులి'. శింబుదేవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్‌, హన్సిక, శ్రీదేవి, సుదీప్‌ తదితరులు నటిస్తున్నారు. నాగార్జున- కార్తి కలసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రంలో శ్రుతిహాసన్‌ నటించడానికి నిరాకరించడం వల్ల కొత్త చిత్రాల్లో నటించడానికి న్యాయస్థానం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నేపథ్యంలో శ్రుతిహాసన్‌కు సంబంధించిన కాల్షీట్‌ను గతంలోనే తీసుకున్నామని ఆమె తమ చిత్రంలో నటిస్తోందని 'పులి' చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తలకోనలో జరుగుతోంది. ఈ ప్రాంతంలో కళాదర్శకుడు ముత్తురాజ్‌ ఓ పెద్ద గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 150 మందికి పైగా పాలుపంచుకునే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

దీని గురించి నిర్మాతల్లో ఒకరైన పీటీ సెల్వకుమార్‌ మాట్లాడుతూ.. తలకోన వేసవి పర్యాటక ప్రాంతం. ఇక్కడ 20 రోజుల పాటు చిత్రీకరణ జరుపనున్నాం. త్వరలోనే సెలవులు రావడంతో పర్యాటకులు అధికంగా వచ్చేస్తారు. అలాంటప్పుడు సెట్‌ను తొలగించాల్సి వస్తుంది. అందువల్లే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నామని, అందరూ సహకరించాలని కోరారు.

'Puli' Producers about Shruti Hassan!

అలాగే... శ్రుతిహాసన్‌పై వదంతులు ప్రచారం చేయకూడదంటూ సెల్వకుమార్ అభ్యర్థించారు. పీవీపీ సినిమా సంస్థ నాగార్జున, కార్తీ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం నుంచి వైదొలగిన శ్రుతిహాసన్‌కు వ్యతిరేకంగా ఆ సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. శ్రుతి ఆ చిత్రంలో నటించకుండా వేరే కొత్త చిత్రం ఒప్పుకుని నటించడానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి తమ సంస్థ విజయ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతి, హన్సిక, శ్రీదేవి, సుదీప్ నటిస్తున్నారు. శ్రుతి మా చిత్రం కోసం ఏప్రిల్ ఒకటి నుంచి 15వ తారీఖు వరకు కాల్‌షీట్స్ కేటాయిం చారు అని వివరించారు.

ఇక తెలుగు,తమిళ భాషల్లో రాణిస్తున్న శృతిహాసన్ కెరీర్ కు అర్దాంతరంగా బ్రేకులు పడ్డాయి. ఆమె ఏ కొత్త సినిమా ఒప్పుకోకూడదని, క్రిమినల్ ఇన్విస్టిగేషన్ చెయ్యమని చెన్నై కోర్టు ఆర్డర్ వేసింది. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ (హైదరబాద్,చెన్నై) వారు ఈమెపై సివిల్ మరియు, క్రిమినల్ ప్రొసీడిగ్స్ జరపమని కోరారు.

తమ సంస్థ నిర్మించే సినిమా విషయంలో ముందస్తు ఒప్పందాన్ని కథానాయిక శృతిహాసన్ ఉల్లంఘించిందని చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పిక్చర్‌హౌస్ మీడియా లిమిటెడ్ ఆమెపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొత్త సినిమాలకు శృతిహాసన్ సంతకం చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్‌నిచ్చింది.

ఈ కేసును విచారించి చర్యలు చేపట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసుకు దారితీసిన పరిస్థితుల్ని తెలియజేస్తూ పిక్చర్‌హౌస్ మీడియా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..నాగార్జున, తమిళ నటుడు కార్తి కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటించడానికి శృతిహాసన్ అంగీకరించింది. అందుకుగాను పిక్చర్‌హౌస్ మీడియా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్‌లో శృతిహాసన్ ఇప్పటివరకు పాల్గొనలేదు. ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ కారణంగా డేట్స్‌ను సర్దుబాటు చేసుకోలేకపోతున్నానని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నానని శృతిహాసన్ ఈ మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమా విషయంలో ఆమెతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన తర్వాతే, ఆమెకు అనుకూలమైన డేట్స్‌ను తీసుకోవడం జరిగింది.

అర్థాంతరంగా ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడంతో మా సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లింది. శృతిహాసన్ వృత్తి వ్యతిరేక బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల మా సంస్థ పేరుప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం కూడా వుంది. దాంతో పాటు ఇతర ఆర్టిస్టుల సమయం కూడా వృధా అవుతుంది. ఇలాంటి వృత్తిధర్మ వ్యతిరేక చర్యలు పునరావృతం కాకూడదని శృతిహాసన్‌పై కేసు వేశాం అని పిక్చర్‌హౌస్ మీడియా సంస్థ పేర్కొంది.

English summary
PT Selvakumar and Thameens who are producing Ilayathalapathy Vijay's Puli which also has Shruti Haasan playing one of the female leads has said that the actress haven't signed any other movie and she has given her dates only for their film Puli as postponing the shoot will cause them huge financial losses.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu