»   » అఫీషియల్: యూట్యూబ్‌లో ఎక్కువ హిట్లు ఈ ట్రైలర్‌ కే

అఫీషియల్: యూట్యూబ్‌లో ఎక్కువ హిట్లు ఈ ట్రైలర్‌ కే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్‌, శ్రుతిహాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పులి'. చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ,టీజర్ ని విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది'.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో శ్రీదేవి కీలక పాత్ర పోషించినందున హిందీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఎక్కువ హిట్లతో దూసుకెళ్తోంది.

మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఈ ట్రైలర్‌ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన 'కిక్‌ 2' అధిక హిట్లతో తొలి స్థానంలో ఉంది. ఆ రికార్డును 'పులి' ట్రైలర్‌ శుక్రవారం బ్రేక్‌ చేసింది. కిక్‌-2 ట్రైలర్‌కు 1,01,855 హిట్లు ఉండగా... 'పులి' ట్రైలర్‌కు 1,01,968 హిట్లు వచ్చాయి.

Puli trailer becomes the most ‘liked’ on YouTube

ఎక్కువ మంది వీక్షించిన రికార్డుల్లో పులి ట్రైలరే ముందుండటం విశేషం. ఈ చిత్రాన్ని రానున్న అక్టోబరు ఒకటో తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజు కోసం విజయ్‌ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో విజయ్‌ సరసన శ్రుతిహాసన్‌, హన్సిక జంటగా నటించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం కథని శింబు దేవన్ రాసారు. పులి చిత్రం యాక్షన్ ఎడ్వెంచర్ ఫాంటసీ గా సాగుతుంది. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారు. ఈ కథ పురాతన కాలంలోనూ, ఇప్పటి మోడ్రన్ ప్రపంచంలోనూ జరుగుతుంది.

ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజీ వస్తోంది. చిత్ర హక్కుల కోసం పలువురు నిర్మాతలు పోటీపడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పోస్టర్‌లో విజయ్‌ మధ్యయుగానికి చెందిన వీరుడిలా కనిపిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
The trailer of Ilayathapathy Vijay’s upcoming socio- fantasy film, Puli, has now achieved a phenomenal feat. With more than 1.04 lakh likes on YouTube, Puli’s trailer becomes the ‘most like Indian trailer ever’, pushing its close counterparts, Salman’s Bajarangi Bhaijaan and Kick trailers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu