»   » అంత ఫ్లాప్ సినిమా కూడా డబ్ చేస్తున్నారా?: ఏ బావుకుందామనీ

అంత ఫ్లాప్ సినిమా కూడా డబ్ చేస్తున్నారా?: ఏ బావుకుందామనీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ్ హీరో సినిమా ఒకటి తెలుగులో మంచి లాభాలను రాబట్టిందంటే చాలు. ఇక ఆ హీరో సినిమాలన్నీ తెలుగులోకి డబ్ చేసి ఫలా హిట్ సినిమా హీరో నుంచి వచ్చిన సినిమా అని పోస్టర్ల మీద రాసి మన మీద వదిలేసేవారు. సాధారణం గానే ఇలాంటి సినిమాలు ఇక్కడ కూడా పెద్దగా ఆడవు, రజినీకాంత్ నుంచి మొన్నటి బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ దాకా ఇదే తంతు. అయితే ఇప్పుడు ఈ హవా అటుకూడా మళ్ళింది బాహుబలి హిట్ కొట్టగానే ప్రభాస్ సినిమాలన్నీ ఇటు తమిళ్ లోకీ అటు హిందీ లోకీ డబ్ చేసి వదులుతున్నారు. అవీ పెద్దగా ఆడటం లేదు.

సందీప్ కిషన్

సందీప్ కిషన్

అయితే ఈ విషయం ప్రభాస్ వరకూ ఓకేనే గానీ సందీప్ కిషన్ సినిమాలు కూడా ఇప్పుడు తమిళ్ లోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారట. అదేంటీ ఈ మధ్య సందీప్ కిషన్ సినిమాలేవీ తెలుగులో లేవే అనుకుంటున్నారా...? వాళ్ళు డబ్ చేసేది ఇప్పటి సినిమా కాదు...

రారా కృష్ణయ్య

రారా కృష్ణయ్య

సందీప్ కిషన్ కొన్నేళ్ల కిందట ‘రారా కృష్ణయ్య' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి హిట్టు తర్వాత వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి అప్పట్లో. కానీ ఆ అంచనాలని రారా కృష్ణయ్య నిలబెట్టుకోలేక పోయింది. తెలుగులో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

మాయవన్

మాయవన్

ఆ తర్వాత వచ్చిన సందీప్ కిషన్ సినిమాలు కూడ పెద్దగా ఆడలేదు. ఐతే సందీప్ కిషన్ ఈ మధ్య తమిళంలో ‘నగరం' అనే సినిమా తో మంచి హిట్టు కొట్టాడు. దీని తర్వాత సుశీంద్రన్ దర్శకత్వంలో ‘నా పేరు శివ'కు సీక్వెల్‌గా ఓ సినిమా.. ‘మాయవన్' అనే మరో క్రేజీ మూవీ చేశాడక్కడ. అదికూడా ఒక మోస్తరు లాభాలని తెచ్చి పెట్టింది. అంతే ఇప్పుడు సందీప్ కిషన్ ని యూత్ ఐకాన్ గా చెప్తూ అతని పాత సినిమాలని మళ్ళీ మార్కెట్ చేయాలని చూస్తున్నారు.

రెజీనా కసాండ్రా

రెజీనా కసాండ్రా

ఇక మరోవైపు రెజీనా కసాండ్రాకు కూడా తమిళంలో మంచి ఫాలోయింగే ఉంది. ఇంకేం ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావటం తో వీళ్లిద్దరూ జంటగా నటించిన ‘రారా కృష్ణయ్య'ను ‘మహేంద్ర' పేరుతో తమిళంలోకి అనువాదం చేస్తున్నారు. ఇలాంటి సినిమాల వల్ల దక్కే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు.

ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు

ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు

ఈ విషయం ఎప్పటినుంచో అర్థమౌతూ వస్తున్నా మరి ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం కాదు. ఇక పోతే అక్కడ సూపర్ హిట్ సినిమాలు కూడా ఇక్కడ ఫ్లాప్ అయ్యాయి. తమిళ ప్రేక్షకుల అభిరుచికి ఈ సినిమా కూడా నచ్చుతుందేమో చూడాలి మరి...

English summary
Regina Cassandra and Sundeep Kishan movie “Ra Ra Krishnayya” which didn’t worked well at Box office is going to get dubbed in to Tamil on few days. is going to get dubbed in to Tamil on few days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu