శ్రీలంక బాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్నా రాధిక శరత్ కుమార్!

శ్రీలంక మరోసారి నెత్తరోడింది. ఆదివారం ఉదయం క్రైస్తవులు ఈస్టర్ పండగ సందర్భంగా ప్రార్థనలు జరుపుతుండగా టెర్రరిస్టులు నరమేధం సృష్టించారు. చర్చిలతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో దాదాపు 150 మందికి పైగా అమాయకులు మరణించగా, 400 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.

శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ నివాసం సమీపంలోని సిన్నమోన్ గ్రాండ్ హోటల్‌లో కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇదే హోటల్‌లో ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ బసచేశారు. అయితే పేలుళ్లు సంభవించడానికి కొంత సేపటి ముందు ఆమె హోటల్ ఖాళీ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

ట్వీట్ చేసిన రాధిక

బాంబు పేలుళ్లు సంభవించిన అనంతరం రాధిక శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘శ్రీలంకలో బాంబు పేలుళ్లు సంభవించాయి. నేను స్టే చేసిన కొలంబొలోని సిన్నమోన్ గ్రాండ్ హోటల్ ఖాళీ చేసి బయటకు వచ్చిన కొంతసేపటికే అక్కడ పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటన నన్ను షాక్‌కు గురి చేసింది' అని రాధిక ట్వీట్ చేశారు.

మేడమ్ మీరు సేఫ్‌గా రావాలి

మేడమ్ మీరు సేఫ్‌గా రావాలి

పేలుళ్ల విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు రాధిక ట్వీట్‌పై స్పందించారు. నటి, విజె రమ్య సుబ్రమణియన్ స్పందిస్తూ...‘పేలుళ్ల గురించి విని షాకయ్యాను. మీరు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేశారు. మరి కొందరు తమిళ ప్రముఖులు కూడా రాధిక ట్వీట్ మీద స్పందించారు.

సాయి ధరమ్ తేజ్ ట్వీట్

శ్రీలంక పేలుళ్లపై తెలుగు నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ... ‘ఇది చాలా విషాదకర సంఘటన. మృతుల కుటుంబాలకు మనో ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

విశాల్

శ్రీలంకలో బాంబు పేలుళ్లను గురించి విని షాకయ్యాను. శ్రీలంక ప్రజల కోసం ప్రార్థనలు జరుపండి. ఇది చాలా దారుణమైన సంఘటన అని విశాల్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X