»   » స్టార్ హీరో సరసన 'రక్త చరిత్ర' హీరోయిన్

స్టార్ హీరో సరసన 'రక్త చరిత్ర' హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Radhika Apte
  చెన్నై : రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' చిత్రంలో చేసిన రాథిక ఆప్టే గుర్తుండే ఉంటుంది. ఆమెకు ఆ తర్వాత పెద్ద ఆఫర్స్ వస్తాయని అంతా భావించారు కానీ...ఆమె కెరీర్ అనుకున్నంత వేగం పుంజుకోలేదు. అయితే ఆమె తాజాగా తెలుగు,తమిళ భాషల్లో మార్కెట్ ఉన్న కార్తీ ప్రక్కన బుక్ అయ్యింది. దాంతో మళ్లీ తన కెరీర్ రీ స్టార్ట్ అయినట్లు భావిస్తోంది.


  'బిరియాని' తయారీలో తీరికలేకుండా ఉన్న కార్తి ప్రస్తుతం రాజేష్‌ దర్శకత్వంలోని 'అల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా'లో కూడా నటిస్తున్నాడు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్. మరో హీరోయిన్ కోసం గతంలో అన్వేషణ సాగించారు. తదనంతరం భావనను రెండో హీరోయిన్ గా తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ స్థానాన్ని నటి రాధిక ఆప్టే సొంతం చేసుకుంది. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ.. ప్రారంభంలో భావనతో మాట్లాడాం. ఆమె బిజీగా ఉండటంతో కాల్షీట్లు కుదరలేదు. అందుకే రాధిక ఆప్టేను ఎంపిక చేసుకున్నామని చెప్పారు .

  కార్తీ, రాజేష్‌ కలయికలో వస్తున్న సినిమా 'ఆల్‌ఇన్‌ఆల్‌ అళగురాజా' . ఈ చిత్రం రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేమ, హాస్యం కలగలిపి కార్తీ నటించనున్నాడు. సాధారణ మాటల్లో దాగున్న హాస్యాన్ని వెతికి మరీ.. తెరపై వెదజల్లి చిరునవ్వుల పంటను పండించడంలో దర్శకుడు రాజేష్‌ సిద్ధహస్తుడు. 'ఎస్‌ఎంఎస్‌', 'బాస్‌ ఎనగర బాస్కరన్', 'ఓకే ఓకే' వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ మూడు చిత్రాల్లోనూ ఒకే శైలి హాస్యం ఉన్నా.. భిన్నమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇప్పుడీ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నాడు.


  రక్తచరిత్ర చిత్రంలో పరిటాల రవి సతీమణి పరిటాల సునీత పాత్రలో రాధిక ఆప్టే అద్భుతంగా, సహజ సిద్ధంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన 'దోని' చిత్రంలో కూడా రాధిక తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పలు తమిళ చిత్రాల్లో పాటు, ఓ మరాఠీ చిత్రంలో నటిస్తోంది. 'కరికలన్' మరియు 'వెట్రి సెల్వన్' అనే రెండు తమిళ చిత్రాలు త్వరలో విడుదలకానున్నాయి.

  English summary
  After sharing screenspace with Suriya in Rakhta Charitra, Radhika Apte will be seen opposite Karthi in his forthcoming film, All In All Azhagu Raja. Directed by Rajesh, the film has Kajal Aggarwal in the lead. A source close to the project tells us, "Radhika will be making a guest appearance in the film, and her character is also paired with Karthi. It's an interesting role and will give the story a new twist. She has been shooting in Pollachi for the last 10 days, and will wrap up her portions in a couple of days."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more