»   » బ్లాక్ మెయిల్ చేస్తోంది.. వేధిస్తున్నది.. హీరోయిన్‌పై హీరో కేసు

బ్లాక్ మెయిల్ చేస్తోంది.. వేధిస్తున్నది.. హీరోయిన్‌పై హీరో కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హీరోయిన్‌ పై హీరో కేసు !

నటుడు అమిత్ తనను పెళ్లి చేసుకొని మోసగించాడని వర్ధమాన తార రాధికాశెట్టి ఆరోపణలు చేయడం కన్నడ పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే రాధికపై కూడా అమిత్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. అమిత్‌పై ఆరోపణలు చేస్తూ ఆమె బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ ఐ లవ్ యూ అనే కన్నడ చిత్రంలో కలిసి నటించారు.

ఐ లవ్ యూ చిత్రంలో

ఐ లవ్ యూ చిత్రంలో

కన్నడ చిత్రసీమలో తాము ఐ లవ్ యూ సినిమాలో నటిస్తున్న సమయంలో మా మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమకు అమిత్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పకపోవడంతో రహస్యంగా పెళ్లి చేసుకొన్నాం.

నాలుగేళ్లు కాపురం

నాలుగేళ్లు కాపురం

పెళ్లి తర్వాత ఒకే ఇంట్లో ఉంటూ నాలుగేళ్లు కాపురం చేశాం. నాలుగేళ్లు నన్ను వాడుకొన్న తర్వాత ఇప్పుడు వేరో యువతిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని తన ఫిర్యాదులో పేర్కొన్నది.

అయితే రాధికాశెట్టి ఆరోపణలను అమిత్ ఖండించారు. రాధికాశెట్టిన తాను వివాహం చేసుకోలేదు. ఆమె చేసే ఆరోపణల్లో వాస్తవం లేదు. నాపై అనవసరంగా బురద జల్లుతున్నారు అని అమిత్ పేర్కొన్నారు.

 బ్లాక్ మెయిల్, వేధింపులు

బ్లాక్ మెయిల్, వేధింపులు

రాధికాశెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నది. వేధింపులకు పాల్పడుతున్నది అని రాధిక ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్‌లోనే అమిత్ కేసు నమోదు చేశారు.

రాజీ కోసం పెద్దల ప్రయత్నాలు

రాజీ కోసం పెద్దల ప్రయత్నాలు

రాధికశెట్టి, అమిత్ ఒకరిపై మరొకరు కేసు నమోదు చేసుకోవడం కన్నడ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కొందరు ప్రముఖులు రంగంలోకి దిగినట్టు సమాచారం. అయితే ఫిర్యాదులు అందుకొన్న పోలీసులు త్వరలోనే విచారణ చేపడుతామని మీడియాకు వెల్లడించారు.

Read more about: amith radhika shetty
English summary
'I Love You' kannada movie actress Radhika Shetty gave complaint against actor Amith in Rajarajeshwari police station Bengaluru.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X