»   » బస్సు నడుపుతూ... ఒకప్పటి టాప్ తెలుగు హీరోయిన్

బస్సు నడుపుతూ... ఒకప్పటి టాప్ తెలుగు హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు తమిళ భాషల్లో వెండితెరపై ఎన్నో బోల్డ్‌, డేరింగ్‌ పాత్రలు పోషించిన సీనియర్‌ నటి రాధిక ఒకప్పుడు టాప్ హీరోయిన్ స్థానం లో ఒక వెలుగు వెలిగింది. ఆతర్వాత సెకండ్ ఇన్నిగ్స్ లో అటు టీవీ లోనూ, ఇటు సినిమాలోనూ వైవిధ్య భరితమైన పాత్రలతో ఆకట్టుకుంటోంది. సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆమె ఇంత కు ముందెన్నడూ పోషించనటు వంటి, ఎవరూ ఊహించనటువంటి పాత్ర అది. రాధిక నటిస్తున్న తాజా చిత్రం 'ఇప్పడి వెల్లుమ్‌'. ఉదయనిధి, మంజిమ మోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌరవ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రాధిక హీరో తల్లిగా, బస్సు డ్రైవర్‌ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం చిత్రీ కరణ ప్రారంభించడానికి ముందు బస్సు డ్రైవింగ్‌ కూడా నేర్చుకుందట.

Radhika turns as Bus Driver in a Tamil Film

విల్లుపురం నుంచి నిపుణులు ప్రత్యేకంగా చెన్నై కి వచ్చి మరీ రాధికకు బస్సు డ్రైవింగ్‌ నేర్పించి న ట్టు సమాచారం. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. చాలా తక్కువ రోజుల్లో రాధిక బస్సు నడపడంలో నైపుణ్యం సంపాదించి అందర్నీ ఆశ్చ ర్యపరిచారట. ఇప్పడు సెట్స్‌లో ఎవరి సహాయం లేకుండానే నిజమైన డ్రైవర్‌గా బస్సు నడిపేస్తున్నారని చెబుతున్నారు. త్వరలో రాబోతున్న అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాధిక బస్సు శిక్షణ పొందుతున్న వీడియోను విడుదల చేసేందుకు గౌరవ్‌ బృందం ప్లాన్ చేస్తుందట.

English summary
the veteran actress Radhika plays a meaty character also she will be seen as bus driver for the first time. For Udhaynithi and Manjima Mohan starrer "Ippadai Vellum"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X