»   »  బెదిరిస్తున్నారంటూ...పోలీస్ ప్రొటక్షన్ కోరిన లారెన్స్

బెదిరిస్తున్నారంటూ...పోలీస్ ప్రొటక్షన్ కోరిన లారెన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఆమధ్య వచ్చిన 'పటాస్' హిట్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఈ హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్ లో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. మొత్త శివ...కొట్ట శివ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం రిలీజ్ విషయమై పోలీస్ ప్రొటక్షన్ కోరుతున్నారు.

చెన్నై పోలీస్ కమిషనర్ కు లారెన్స్ కంప్లైంట్ చేసారు. తనకు ఈ సినిమా రిలీజ్ అపమంటూ ఎవరో తెలియని వ్యక్తులు చాలా మంది బెదిరిస్తున్నారని ఆయన ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని వేందర్ మూవీస్ వారితో కలిసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు.

లారెన్స్ మాట్లాడుతూ... " మేము మొదట వేదంర్ మూవీస్ మదన్ తోనూ, సూపర్ గుడ్ వారితోనూ కలిసి ఓ సినిమాని మొదలెట్టాం. ఆ సినిమా కు ఈ పటాస్ రీమేక్ కు పోలిక లేదు. ఆ సినిమా నేను రాసుకున్న ఒరిజనల్ స్క్రీన్ ప్లే ని బేస్ చేసుకుని రెడీ చేసుకున్నాం. కానీ కొన్ని సమస్యల వల్ల ఆ కథను ఆపేసాం. ఇప్పుడు మేము రిలీజ్ చేస్తోంది పటాస్ తమిళ రీమేక్.

ఈ సినిమాకు మదన్ తో అనుకున్న సినిమాకు అసలు సంభందం లేదు. కాని కొంతమంది ఫోన్ చేసి మదన్ పర్మిషన్ తీసుకుని సినిమాని రిలీజ్ చేయాలని సలహా చెప్తున్నారు. ఈ విషయంలో పోలీస్ ల సహాయం అడిగాము అన్నారు.

Ragava Lawrence Wants Police Protection For Motta Shiva Ketta Shiva’s Release

స్టార్ కొరియెగ్రాఫర్ గా హవా సాగించిన లారెన్స్ కొరియోగ్రఫి కి పుల్ స్టాప్ పెట్టి యాక్టింగ్, డైరెక్షన్ బాట పట్టిన విషయం తెలిసిందే. దర్శకుడిగా స్టార్టింగ్ లో మంచి సక్సెస్ లే కొట్టాడు. ఈ క్రమంలో ఆయన డైరెక్ట్ చేసిన డాన్, రెబల్ సినిమాలు లారెన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అంతేనా ఈ సినిమాల రిజల్ట్ వల్ల లారెన్స్ తెలుగులో ముఖం చూపించలేకపోయడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ముని సీక్వెల్ కాంచన2 సినిమా లారెన్స్ కి దర్శకుడిగా నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. గంగ టైటిల్ తో తెలుగులో డబ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ లను రాబట్టింది. అయితే ఇప్పుడు లారెన్స్ ఈ మూవీ సెంటిమెంట్ ని ఫాలో అవుతుండడం విశేషం.

మెట్ట శివ కెట్టా శివ టైటిల్ తో లారెన్స్ కొత్త మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతోంది. విశేషమేంటి ఈ మూవీలో పోలీస్ రోల్ చేస్తున్నప్పటికి లారెన్స్ గుండుతోనే కనిపించబోతున్నడట. కలిసొచ్చిన గుండు తనకు మరో సక్సెస్ ఇస్తోందని ఈ డాన్స్ మాస్టర్ నమ్ముతున్నాడట. మరి లారెన్స్ నమ్మకం ఎంత వరకు నిజం అవుతోందో చూడాలి.

English summary
Ragava Lawrence has filed a complaint with the Chennai police and requested protection to ensure a safe release for his film Motta Shiva Ketta Shiva. In his complaint, the actor says he received several threats from unknown persons about Motta Shiva Ketta Shiva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu