»   » మహేష్, చిరుల రూటులో లారెన్స్

మహేష్, చిరుల రూటులో లారెన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు 'టక్కరి దొంగ', చిరంజీవి 'కొదమసింహం', కృష్ణ 'మోస గాళ్ళకు మోసగాడు' రూటులో ఇప్పుడు రాఘవ లారెన్స్ ఓ కౌబాయ్ చిత్రం చేస్తున్నారు. లారెన్స్ హీరోగా 20 కోట్లతో ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. సంస్థ 'సూపర్ కౌబాయ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు శింబుదేవన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. 18వ శతాబ్దానికి చెందిన కథను తీసుకుని కామెడీ ఎడ్వంచర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెడ్ ఇండియన్స్ గురించి ఇంతవరకూ ఎవరూ చూపించివిధంగా ఇందులో చూపిస్తున్నాని చెప్తున్నారు. ఇఖ ఈ చిత్రం కోసం కేరళలో 300 మంది వర్కర్స్ సాయంతో అద్భుతమైన సెట్ రూపొందించిం షూట్ చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి రాఘవ లారెన్స్ మాట్లాడుతూ 'ఈ సినిమాని చాలా లావిష్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అరుదైన లొకేషన్లలో నిర్మించిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు.

శిధిలావస్థలో ఉన్న విజయనగర సామ్రాజ్యపు కందికోటలోని కంది కెనాల్‌లో తొలిసారిగా షూటింగ్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కల్పాతి ఎస్.అగోరం చెప్పారు. పద్మప్రియ, లక్ష్మీరాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ చత్రంలో సాయికుమార్, సంధ్య, నాజర్, మనోరమ, సెంథిల్, మౌళి, ఢిల్లీ గణేష్, రమేష్ ఖన్నా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu