»   » తీవ్ర నెప్పితో హాస్పటిల్ లో చేరిన రాఘవ లారెన్స్‌

తీవ్ర నెప్పితో హాస్పటిల్ లో చేరిన రాఘవ లారెన్స్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ అయిన రాఘవ లారెన్స్‌ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర మెడనొప్పితో బాధపడుతుండడంతో శనివారం చెన్నైలోని పల్లవి హాస్పిటల్‌లో చేరారు. జల్లికట్టుపై మెరీనా బీచ్‌లో జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న లారెన్స్‌ బీచ్‌ వద్దకు మెడకు గార్డు కూడా పెట్టుకొచ్చారు. అక్కడ కాస్త అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Raghava lawrence hospitailized

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్కచేయక మెడకి బ్యాండ్‌తోనే గళం విప్పారు. అయితే మూడు రోజులుగా ఆయన బాగా అలసిపోవడం, అనారోగ్యం ఇబ్బందిపెట్టడంతో సొమ్మసిల్లిపడ్డారు. శుక్రవారం ఉదయం లారెన్స్ మెరీనాబీచ్‌కు వెళ్లి ఆందోళన చేస్తున్న విద్యార్థులతోపాటు కూర్చున్నారు. 11.30గంటల సమయంలో ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయన్ని యువకులు అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. అంబులెన్స్ సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్సలు అందజేసిన కొద్దిసేపటికి కోలుకున్నారు.

ఇక జల్లికట్టు పోరాటంలో పాల్గొన్న వారికి ఆహారం, తాగునీరు అందజేసేందుకు కోటి రూపాయలైనా వ్యయం చేస్తానని ప్రకటించిన రీల్ హీరో రాఘవ లారెన్స్. ఈ విషయంలో ఆయన పెద్ద మనసు చాటుకోవడమే కాకుండా, జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్న యువతకు అండగా ముందు నిలబడ్డారు. దీంతో ఈయన ఇపుడు రియల్ హీరో అయ్యారు.అంతేకాకుండా, ఈ ఆందోళనలో పాల్గొన్న మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించారు లారెన్స్. దీంతో మరుగుదొడ్డి సదుపాయం ఉన్న ఐదు కేరవాన్‌లను మెరీనా తీరంలో ఏర్పాటుచేయించారు. ఈ కేరవాన్‌లను ఆయన నటించిన 'శివలింగ' చిత్ర యూనిట్‌కి చెందినవి. ఈ చిన్న సాయం లారెన్స్‌ని పోరాటంలో పాల్గొంటున్న యువతకు పెద్దన్నని చేసింది

English summary
Actor Raghava Lawrence has allegedly been admitted at Pallava hospital due to neck pain while protesting at Marina beach to lift the ban on Jallikattu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu