తమిళ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీ.. లారెన్స్ హీరోగా అధికారమ్ అంటూ!

ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం పాన్ ఇండియా సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఒక మలయాళం ఇండస్ట్రీ తప్పితే మిగతా భాషల నుంచి దాదాపు ఏదో ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఈ మధ్యనే తమిళం నుంచి ఒక పాన్ ఇండియా సినిమా ప్రకటన రాగా, ఈరోజు మరో పాన్ ఇండియా ప్రకటన వచ్చింది. రాఘవ లారెన్స్ హీరోగా ఈ మధ్యనే ఒక హిట్ సినిమా అందించిన దర్శకుడితో ఈ సినిమా ప్రకటన వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

కొద్దిసేపటి క్రితమే

కొద్దిసేపటి క్రితమే

కాంచన రీమేక్ తో బాలీవుడ్ లో డైరెక్టర్ గా లక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల విషయంలో గ్యాప్ తీసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా రాఘవ లారెన్స్ హీరోగా అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందిస్తున్న ఈ సినిమా ప్రకటన కొద్దిసేపటి క్రితం వెలువడింది.

వెట్రిమారన్ కథ

వెట్రిమారన్ కథ

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ - స్క్రీన్ - ప్లే డైలాగ్స్ అందిస్తున్న అధికారమ్ అనే సినిమాకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. చాలా రోజులు వెట్రిమారన్ వద్ద దర్శకత్వ విభాగంలో అసోసియేట్ గా పని చేసిన సెంథిల్ గతంలో ధనుష్ 'కోడి' తెలుగులో ధర్మ యోగి పేరుతో రిలీజ్ అయింది. అలాగే పటాస్ అనే మరో సినిమాను కూడా ఆయన తెరకెక్కించారు.

ఇంటెన్స్ లుక్ లో

ఇంటెన్స్ లుక్ లో

ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. దానికి సంబంధించి ఈ రోజు మేకర్స్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసి ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాఘవ లారెన్స్ చాలా కోపంగా కనిపిస్తున్నాడు అని చెప్పవచ్చు. రక్తంతో తడిసిన కోట్ వేసుకున్న లారెన్స్ చేతిలో కత్తి పట్టుకుని ఆ రక్తంతో నడుచుకుంటూ వస్తున్నట్లు ఉగ్రంగా చూపించారు.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక రాఘవ లారెన్స్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా రుద్రం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను కదిరేశన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇక చంద్రముఖి సినిమాకి సీక్వెల్ కూడా గతంలో ప్రకటించిన ఆ సినిమాకు సంబంధించిన పనులు అయితే ప్రస్తుతం ఏమీ జరగడం లేదని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం అందాల్సి ఉంది.

కరోనా కాలంలో సాయం

కరోనా కాలంలో సాయం


ఇక కరోనా రాఘవ లారెన్స్ తన శక్తికి మించి సేవలు అందించాడు అనే చెప్పాలి. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధి, సహా ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. ఇవి కాక ఆయన చేతనైన సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X