»   » రజనీకాంత్ గురించి లారెన్స్ ఎమోషనల్ ట్వీట్.. చిన్నప్పటి ఫొటోతో...

రజనీకాంత్ గురించి లారెన్స్ ఎమోషనల్ ట్వీట్.. చిన్నప్పటి ఫొటోతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటనపై అన్నివర్గాల నుంచి సానుకూల స్పందన వస్తున్నది. ఇప్పటికే సినీ వర్గాలు, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన వారు రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కోరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన పోస్ట్ ఏమిటంటే..

చిన్నతనంలో రజనీకాంత్‌తో

చిన్నతనంలో రజనీకాంత్‌తో

లారెన్స్ రాఘవ తన చిన్నతనంలో రజనీకాంత్‌తో దిగిన ఫొటోను తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. ఫొటోతో పాటు తన భావాల్ని ఈ విధంగా పంచుకొన్నారు.

12 ఏళ్ల వయసులో తలైవాతో

12 ఏళ్ల వయసులో తలైవాతో

నా స్నేహితులు, అభిమానులకు హాయ్. నేను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రజనీకాంత్ సర్‌ను కలిశాను. నేను తలైవర్ ఫ్యాన్స్ క్లబ్‌లో సభ్యుడిని. చిన్నప్పటి నుంచే రజనీ సర్ అంటే చాలా ఇష్టం.

అభిమానం ఎప్పటికీ మారదు

అభిమానం ఎప్పటికీ మారదు

చిన్నప్పటి నుంచి నేను ఎలా రజనీకాంత్ ఫ్యాన్‌నో ఇప్పటికీ అంతే. తలైవా పట్ల ఎప్పటికీ నా అభిమానం మారదు. అని మూడు ఫొటోలను పెట్టి ట్వీట్ చేశారు.

రజనీకాంత్ వెంటే లారెన్స్

అయితే ఇప్పటికే విశాల్, ఇతర సినీ నటులు రజనీ రాజకీయ ప్రవేశంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సేవాభావం ఎక్కువగా ఉన్న లారెన్స్.. రజనీతోపాటు రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

English summary
Raghava Lawrence: my love never change as a Thalaivar Rajinikanth‘s Fan
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu