»   » మాట మీద నిలబడ్డాడు... జల్లికట్టు హీరో లారెన్స్

మాట మీద నిలబడ్డాడు... జల్లికట్టు హీరో లారెన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడు మొత్తం ఒకే తాటి మీదకు వచ్చింది... జల్లికట్టు కోసం పట్టు విడవకుండా జరుగుతున్న పోరాటం లో వందలు, వేలమంది వచ్చి చేరుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లూ జరుగుతూనే ఉన్నాయి. జల్లికట్టు పోరాటంలో పాల్గొన్న వారికి ఆహారం, తాగునీరు అందజేసేందుకు కోటి రూపాయలైనా వ్యయం చేస్తానని ప్రకటించిన రీల్ హీరో రాఘవ లారెన్స్.

ఈ విషయంలో ఆయన పెద్ద మనసు చాటుకోవడమే కాకుండా, జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్న యువతకు పెద్దన్నగా ముందు నిలబడ్డారు. దీంతో ఈయన ఇపుడు రియల్ హీరో అయ్యాడు సమాజికంగా ఏ సంఘటనకైనా వెంతనే స్పందించే కోలీవుడ్ సినీపరిశ్రమ కూడా తనవంతు మద్దతు తెలియజేసింది. ఇంకొంతమంది నటీనటులు వీలు చూసుకుని మెరీనా బీచ్‌లో జరుగుతున్న ఈ ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అయితే, ప్రముఖ కొరియోగ్రాఫర్, ఫిలింమేకర్ అయిన రాఘవ లారెన్స్ మాత్రం కేవలం ప్రకటనలు ఇచ్చి ఊరుకోకుండా బుధవారం జరిగిన ఆందోళనలో నేరుగా పాల్గొన్నాడు.

మాటలు చెప్పినట్టు కాదు:

మాటలు చెప్పినట్టు కాదు:

జల్లికట్టు కు మద్దతుగా బీచ్ లో ఆందోళనలో పాల్గొంటున్న వారికి ఆహారం, నీరు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు భరించడానికి కూడా ముందుకొచ్చిన లారెన్స్.. అందుకోసం ఏకంగా రూ. 1 కోటి విరాళంగా ప్రకటించేశాడు.అదీ ఏదో మాటలు చెప్పినట్టు కాదు వెంటనే చెప్పిన సౌకర్యాలన్నీ కల్పించటం మొదలయ్యింది కూడా

టాయ్‌లెట్‌ సదుపాయం:

టాయ్‌లెట్‌ సదుపాయం:

తాజాగా పోరాటంలో పాల్గొంటున్న మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టాయ్‌లెట్‌ సదుపాయం ఉన్న ఐదు కేరవాన్‌లను మెరీనా తీరంలో ఏర్పాటుచేశారు. ఈ కేరవాన్‌లను ఆయన నటించిన ‘శివలింగ' చిత్ర యూనిట్‌కి చెందినవి.వాటిని తెప్పించి నిరసనకారుల సౌకర్యం కోసం బీచ్ ఒడ్డున నిలిపాడు..

మెరీనా తీరంలో :

మెరీనా తీరంలో :

దాంతో తమిళ జనమంతా శభాష్‌ లారెన్స్ అంటూ కీర్తిస్తున్నారు. తాము చేస్తున్న పోరాటానికి చిత్తశుద్ధితో మద్ధతు తెలిపిన సినీ ప్రముఖుడు లారెన్స్ మాత్రమే అంటూ యువత కొనియాడుతున్నారు. మెరీనా తీరంలో జల్లికట్టుకు మద్దతుగా నిర్వహిస్తున్న ఆందోళనలో లారెన్స్ స్వయంగా పాల్గొని యువకులందరికీ సపోర్ట్ గా ఉన్నాడు.

మెడకి బ్యాండ్‌తోనే :

మెడకి బ్యాండ్‌తోనే :

అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్కచేయక మెడకి బ్యాండ్‌తోనే అక్కడ నిరసనలో పాల్గొంటున్నడు లారెన్స్. . అయితే మూడు రోజులుగా బాగా అలసిపోవడం, అనారోగ్యం ఇబ్బందిపెట్టడంతో సొమ్మసిల్లిపడ్డాడు కూడా. శుక్రవారం ఉదయం లారెన్స్ మెరీనాబీచ్‌కు వెళ్లి ఆందోళన చేస్తున్న విద్యార్థులతోపాటు కూర్చున్నాడు.

అస్వస్థతకు గురై :

అస్వస్థతకు గురై :

11.30గంటల సమయంలో ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయన్ని యువకులు అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. అంబులెన్స్ సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్సలు అందజేసిన కొద్దిసేపటికి కోలుకున్నాక కూడా మళ్ళీ అక్కడే ఉండిపోయాడు.

ఆహారం, మంచినీళ్లు :

ఆహారం, మంచినీళ్లు :

జల్లికట్టు కోసం తమిళులందరూ ఒక్కటయ్యారు. ఇదే మనకి సగం విజయం. నటీనటులందరూ జల్లికట్టుకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయం. నిన్న (మంగళవారం) నాకు ఒక సందేశం వచ్చింది. పోరాటంలో పాల్గొన్న వారికి ఆహారం, మంచినీళ్లు లభించడం లేదని. వరదలు వచ్చినప్పుడు సాయం చేశాం. ఈ పోరాటానికీ చేస్తాం.

కేంద్రం దిగొస్తే మంచిది:

కేంద్రం దిగొస్తే మంచిది:

అంతేకాకుండా, జల్లికట్టు తమిళ సంప్రదాయానికి అద్దం పట్టే క్రీడ. దానిని జరుపుకోకుండా అడ్డుపడే విదేశీ శక్తులను అడ్డుకోవాలి. జల్లికట్టు నిర్వాహకుల నుంచి విద్యార్థులు, సినీ కళాకారుల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఇది న్యాయమైనది. రాష్ట్ర ప్రభుత్వం జల్లికట్టుని జరపాలనే తీర్మానాలు చేసింది. అయినప్పటికీ కేంద్రం ఇంకా పూర్తిగా దృష్టి సారించాలి. విద్యార్థుల పోరాటాన్ని చూసి కేంద్రం దిగొస్తే మంచిది' అని చెప్పిన లారెన్స్ తుదివరకూ జల్లికట్టు విషయం లో పోరాడటానికి సిద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది

మెరీనా బీచ్:

మెరీనా బీచ్:

చెన్నై లోని మెరీనా బీచ్ వద్ద జనం నిరసనలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ప్రజల నిరసనలు తీవ్రం గా మారుతుండడంతో ఈ వ్యవహారం తమిళనాడు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఆఖరికి ప్రధాని మోడీ కూడా ఈ విషయం లో జోక్యం చేసుకోలేనని చెప్పేయటం తో ఇప్పుడు సెగ మరింత రేగుతోంది...

English summary
Raghava Lawrence is contributing Rs 1 crore to the supporters, who have gathered at Marina Beach, Chennai. He is also allegedly providing food, medicines and other useful things for the people
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X