»   » సోదరుడిని హీరోగా పరిచయం చేస్తున్న రాఘవ లారెన్స్ (ఫోటో)

సోదరుడిని హీరోగా పరిచయం చేస్తున్న రాఘవ లారెన్స్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నృత్య దర్శకుడుగా కెరీర్ ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన రాఘవ లారెన్స్‌ సౌత్ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్లో పలు హిట్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘కాంచన-2'(తెలుగులో గంగ) మంచి విజయం సాధించింది. వంద కోట్ల కలెక్షన్ సాధించింది.

త్వరలో లారెన్స్ తన సోదరుడు ఎల్విన్‌‌ను హీరో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కాంచన-2 చిత్రంలో ఎల్విన్ ఓ పాటలో కనిపించాడు కూడా. ఇప్పుడు తన సోదరుడ్ని హీరోని చేస్తూ స్వీయ నిర్మాణంలో ఒక సినిమా తీసేందుకు లారెన్స్‌ సన్నాహాలు ప్రారంభించారు.

Raghava Lawrence's brother Elvin to debut as a hero

ప్రస్తుతం ఎల్విన్‌కు సరిపోయే మంచి కథ కోసం లారెన్స్ వెతుకుతున్నాడు. పలు కథలు వింటూ బిజీగా ఉన్నాడట. ఇప్పటికే ఎల్విన్ అన్ని విభాగాల్లో శిక్షణ తీసుకున్నాడు. అన్నయ్య లారెన్స్ మాదిరిగా అదిరిపోయే స్టెప్పులేయడంలోనూ, యాక్షన్ సీన్లు చేయడంలోనూ ఆరితేరాడు. ఈ సినిమాలో ఎల్విన్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నట్లు సమాచారం. అతని సిక్స్ ప్యాక్ బాడీపై ఇటీవలే ఫోటోషూట్ కూడా నిర్వహించారట.

English summary
Raghava Lawrence's brother Elvin to debut as a hero. A photo shoot for Elvin featuring him with six-pack abs has happened recently and now the images are being shared in social networking sites.
Please Wait while comments are loading...