»   » 'మా చెల్లి నగలు అమ్మి చేయాల్సివచ్చింది': ఎఆర్ రహమాన్

'మా చెల్లి నగలు అమ్మి చేయాల్సివచ్చింది': ఎఆర్ రహమాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా చెల్లి నగలు అమ్మేసి నాకు ఆ డబ్బును ఏర్పాటు చేసింది. అది జీవితంలో మరచిపోలేని అనుభవం అంటూ ఏ ఆర్ రహమాన్ తను స్టూడియో ఏర్పాటు చేసుకున్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన మాటల్లో... అప్పట్లో ఎంతో కష్టపడి ఒక చిన్న స్టూడియోను కొనగలిగా. అయితే, అందులోకి అవసరమైన సామగ్రి కొనడానికి నా చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో తోచలేదు. అమ్మకు నా బాధ కనిపెట్టి విషయమేమిటని అడిగింది. కనీసం రూ.4లక్షల రూపాయలైనా లేనిదే ఏమీ చేయలేనని చెప్పాను. అమ్మ అంతా మౌనంగా విని నా చెల్లి నగలతో నా స్టూడియో ఏర్పాటు చేసింది అన్నారు. ఇలాంటి జీవిత విశేషాలతో రూపొందిన 'ఏఆర్‌ రెహమాన్‌: ది స్పిరిట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌' పుస్తకాన్ని ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. ముంబై..జూహు ప్రాంతంలో ఉన్న నొవోటెల్ హోటల్లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ...ఆయన్ని మ్యూజిక్ డైరక్టర్ గా కన్నా గొప్ప మానవతావాదిగా ఆయన్ని నేను ఆరాధిస్తాను అన్నారు.

English summary
Mani Ratnam, director and long-time friend of Rahman, who officially launched the book, AR Rahman The Spirit of Music, a the Novotel Hotel in Juhu, Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu