»   » దెయ్యంలా తిరుగుతున్న సెక్సీ హీరోయిన్

దెయ్యంలా తిరుగుతున్న సెక్సీ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రస్తుతం తమిళ,తెలుగు పరిశ్రమలలో దెయ్యం సినిమాల హవా సాగుతోంది. అందువల్లే 'దెయ్యం‌' నేపథ్యంలోని సినిమాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఓ స్టార్ హీరోయిన్ ని పెట్టుకుంటే సరిపోతుంది. హీరో అవసరం ఉండదు. కథే హీరో అనొచ్చు..అనే కాన్సెప్టుతో ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా...హన్సిక నటించిన దెయ్యిం సినిమా సైతం తెలుగులో బాగా ఆడింది. లారెన్స్ ...గంగ (ఇదీ దెయ్యాల కథే) కూడా కలెక్షన్స్ అదరకొడ్తోంది. దాంతో మరింత ఉత్సాహం వచ్చి ఎక్కడెక్కడి హీరోయిన్స్ ని తెచ్చి...ఈ దెయ్యం సినిమాలు తీసేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అదే కోవలో... పలు చిత్రాల్లో అందాల తారగా కనిపించిన రాయ్‌లక్ష్మీ తొలిసారిగా ఈ సినిమాలో మాయా అనే దెయ్యం పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం తాంబరంలో చిత్రీకరణ జరుగుతోంది.

Rai Laxmi in Sowkar Pettai movie

శ్రీకాంత్‌, రాయ్‌లక్ష్మీ (లక్ష్నీ రాయ్) ప్రధాన పాత్రలో ఓ దెయ్యం సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'సౌకార్‌పేట్టె' అని పేరు పెట్టారు. చెన్నై, సాహుకారుపేటలోని ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శరవణన్‌, వివేక్‌, అప్పుకుట్టి, కోటా శ్రీనివాసరావు, సంపత్‌, కోవై సరళ, సుమన్‌, పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ తదితరులు నటిస్తున్నారు.

జాన్‌పీటర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం వహిస్తున్నారు వడివుడైయాన్‌. చిత్ర విశేషాల గురించి ఆయన మాట్లాడుతూ.. ఇందులో శ్రీకాంత్‌ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. అందులో ఒకటి మంత్రవాదిగా నటిస్తున్నారు.

English summary
Laxmi Rai became a ghost in Sowkarpettai tamil movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu