»   » హీరో సిద్ధార్థ కోసం చెన్నై వెలుతున్న రాజమౌళి

హీరో సిద్ధార్థ కోసం చెన్నై వెలుతున్న రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం ‘జిల్ జంగ్ జుక్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉందని సిద్ధార్థ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

రాజమౌళిని వారియర్ లుక్ లో చూపిస్తూ..... ఇందుకు సంబంధించిన పోస్టర్ డిజైన్ చేసారు. ‘బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళికి తమిళనాట ఫాలోయింగ్ బాగా పెరిగింది.

Rajamouli coming for Siddharth’s film!

‘జిల్ జంగ్ జుక్' సినిమా వివరాల్లోకి వెళితే...ధీరజ్ వైడీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కామెడీ ప్రధానమైన చిత్రం. సిద్ధార్థ్, సనంత్ రెడ్డి, అవినాష్ రఘుదేవన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సిద్దార్థ్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు నిర్మాత కూడా సిద్ధార్థే.

English summary
Siddharth announced the launch of ‘The theatrical trailer’ of ‘Jil Jung Juk’ on January 14th. Can you guess, who is coming to launch the theatrical trailer? It’s the visionary, S.S.Rajamouli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu