»   » ‘బాహుబలి’ టీమ్ విత్ సూర్యతమిళ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

‘బాహుబలి’ టీమ్ విత్ సూర్యతమిళ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఆరేళ్ల ముందు ‘మనం ఒక పెద్ద సినిమా చేద్దాం' అన్నారు రాజమౌళి. అప్పుడు నేను వరుసగా నాలుగు ఫ్లాపులతో ఉన్నాను. కథ వినగానే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అన్నారు ప్రభాస్. తమిళ బాహుబలి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఇలా స్పందించారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి'. తెలుగు, తమిళ, మళయాల,హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయ్. అందులో భాగంగా...ముంబైలోని ఓ ఈవెంట్‌లో హిందీ,తెలుగు ట్రైలర్‌లను లాంచ్ చేయగా, చెన్నైలో నిర్వహించిన మరో ఈవెంట్‌లో ‘బాహుబలి' తమిళ ట్రైలర్‌ను విడుదల చేశారు.


తమిళంలో కూడా ఈ సినిమాను తమ సినిమాగా స్టార్ హీరోలు ప్రమోట్ చేస్తున్నారు. తమిళంలో పేరొందిన సంస్థ స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఆ సంస్థలో పార్టనర్ అయిన హీరో సూర్య కూడా తన స్దాయిలో బాహుబలికి ప్రచారం కల్పిస్తున్నారు. దాంతో తమిళ పరిశ్రమ నుంచి బాహుబలికి మంచి అండ లభిస్తోంది. ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమాగా బాహుబలికి అన్ని చోట్లా ప్రచారం లభించడంతో నిర్మాతలు ఆనందంగా ఉన్నారు.


ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి ది బిగినింగ్‌'గా పిలవబడుతున్న మొదటి భాగం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే! కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈ నెల్లోనే విడుదల కానుంది.


ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ‘బాహుబలి' చిత్రంలోని విశేషాలను చిత్ర బృందం మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు వారి మాటల్లోనే...


విడుదల ఎక్కడ

విడుదల ఎక్కడ

చెన్నైలోని హయత్‌ హోటల్‌లో చాలా అట్టహాసంగా నిర్వహించిన ట్రైలర్‌ విడుదలైంది.ప్రభాస్ మాట్లాడుతూ...

ప్రభాస్ మాట్లాడుతూ...


నిజానికి నాలుగు సింగిల్‌ లైన్‌ కథలు చెప్పారు. ‘బాహుబలి' లైన్‌ చెప్పినప్పుడు బ్రహ్మాండంగా అనిపించింది. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే చిత్రమిది అన్నారు.అన్ని రోజులు పాటలు పాటు..

అన్ని రోజులు పాటలు పాటు..


ప్రభాస్ కంటిన్యూ చేస్తూ....నేను ఈ చిత్రం కోసం నటించిన 300 రోజుల్లో 200 రోజులు యాక్షన్‌ సన్నివేశాల్లోనే నటించాను. ‘బాహుబలి'తో తొలిసారి తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు.


ఒకటవ తరగతిలోనే... రాజమోళి

ఒకటవ తరగతిలోనే... రాజమోళిఇలాంటి సినిమాలు తీయాలన్నది మా కల అని చాలా మంది దర్శకులు చెబుతుంటా రు. కానీ, ఇది నా కల కాదు. ఇదే నా ప్రపంచం. ఇందులోనే నేను బతుకుతున్నారు. చిన్న వయసులోనే నాన్న నన్ను గ్రంథాలయానికి తీసుకెళ్లేవారు. అక్కడ ‘అమర చిత్ర కథ' పుస్తకంలో కథలు చదివాను. అందులో ఉన్న కథలన్నీ భారత చరిత్ర, జానపదం, మన భావోద్వేగాల గురించే. ఒకటవ తరగతిలోనే ‘బాహుబలి'కి బీజం పడిందనుకుంటాను (నవ్వుతూ..) అన్నారు రాజమౌళి


అలా పుట్టింది

అలా పుట్టింది


దర్శకుడ్ని అయ్యాక రాజు, రాణి కథలతో సినిమాల తీయాలని అనుకునేవాడ్ని. అయితే అందుకు మనపై నమ్మకముంచే నిర్మాత కావాలి. ‘మగధీర' తరువాత ఈ తరహా సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు తీయగలనని నాపై నిర్మాతలకు నమ్మకం పెరిగింది. అలా ‘బాహుబలి' పుట్టింది.చెప్పటం కష్టం...

చెప్పటం కష్టం...


ఈ చిత్రం కోసం ఎంతమంది పనిచేశారన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే ఎంతమంది పనిచేశారో లెక్కేలేదు. ఈ సినిమాలో అత్యంత క్లిష్టమైన యుద్ధ సన్నివేశాలను 120 రోజులు తీశాం. ఎలా పనిచేశామో మాకే తెలీదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఎలా చేశామో అని భయమేస్తోంది. ఇందుకు మన దగ్గరున్న గొప్ప టెక్నీషియన్లూ ఒక కారణం.రెండు సంవత్సరాలు ఇచ్చాడు

రెండు సంవత్సరాలు ఇచ్చాడు


ఇక నా డార్లింగ్‌ ప్రభాస్‌ని ‘బాహుబలి' కోసం ఒక సంవత్సరం అడిగాను. ఈ సినిమాకి సంవత్సరం సరిపోదని చెప్పి రెండు సంవత్సరాలు ఇచ్చాడు. మరో సంవత్సరం ఎక్కువ తీసుకున్నాను. సినిమాలో హీరో కథపై, సినిమాపై ఇంత శ్రద్ధ చూపుతుంటే ఆ దర్శకుడికి మరింత కాన్ఫిడెంట్‌ పెరుగుతుంది. ‘బాహుబలి'కి ప్రభాస్‌ ఆ కాన్ఫిడెంట్‌ని ఇచ్చాడు.అంతా ఆశ్చర్యపోతున్నారు..అదే నా లాజిక్

అంతా ఆశ్చర్యపోతున్నారు..అదే నా లాజిక్


రానా విలన్‌ నటించడంపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ రోల్‌ చేసినందుకు రానాకి ప్రత్యేక అభినందనలు. హీరో కంటే విలన్‌ బలవంతుడైనప్పుడే హీరోయిజం కన్పిస్తుంది. ఇదే నా లాజిక్‌.ఆల్టర్నేటివ్ లేదు

ఆల్టర్నేటివ్ లేదు


ప్రభాస్‌కి తగ్గట్టుగా రానా తప్ప మరెవరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. సెట్‌లో రానా, ప్రభాస్‌ల మధ్య అనుబంధం ‘బాహుబలి'కి పెద్ద అసెట్‌. చివరిగా...

చివరిగా...


, ‘బాహుబలి' ప్రమోషన్‌ కోసం వచ్చిన సూర్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు రాజమోళి.


తమన్నా మాట్లాడుతూ...

తమన్నా మాట్లాడుతూ...


‘బాహుబలి'లో నటించిన తరువాత ఇండస్ర్టీకి కొత్తగా వచ్చిన నటిలా ఫీలవుతున్నాను. ఇదొక కొత్త ఇన్నింగ్స్‌లా అనిపిస్తోంది. ఈ సినిమాలో నటిస్తానని అస్సలు ఊహించలేదు. షూటింగ్‌ ప్రారంభమైన 150 రోజుల తరువాత నన్ను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు నేను పోషించనటువంటి గొప్ప పాత్ర ఇది.అనుష్క మాట్లాడుతూ...

అనుష్క మాట్లాడుతూ...


విభిన్నమైన షేడ్స్‌తో కూడిన పాత్ర నాది. ఒక్క ముఖ్కలో చెప్పాలంటే లైఫ్‌ టైం క్యారెక్టర్‌. ఇంతకుముందు ప్రభాస్‌, రాజామౌళితో కలిసి పనిచేశాను అన్నారు.సూర్య మాట్లాడుతూ..

సూర్య మాట్లాడుతూ..‘బాహుబలి' బడ్జెట్‌లోనే కాదు కష్టంలోనూ అత్యుత్తమ చిత్రం. భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమా. ఇండియన్‌ సినిమా గొప్పతనాన్ని ఈ చిత్రం ప్రపంచానికి చూపబోతుంది. ఈ తరానికి చరిత్ర నేపథ్యంతో కూడిన ఇటువంటి బ్రహ్మాండమైన చిత్రాన్ని అందించడం అసాధ్యం. అటువంటిది ఇంతటి గొప్ప సినిమాని సృష్టించిన ‘బాహుబలి' టీమ్‌కి నా సెల్యూట్‌.


సలహా..విజ్ఞప్తి

సలహా..విజ్ఞప్తి


రాజమౌళి సార్‌కి ఒక విజ్ఞప్తి... ఇక్కడి యువ దర్శకుడు ఈ సినిమా ఎలా తీశారో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. ఒక్కసారి మీరు వచ్చి వారికి వివరిస్తే బాగుంటుంది. ప్రేక్షకులకీ ఒక సలహా.. ‘బాహుబలి' సినిమాని చూడడం మిస్‌ చేసుకోకండి.సత్యరాజ్ మాట్లాడుతూ...

సత్యరాజ్ మాట్లాడుతూ...


కొంతమంది నవ్వించడానికి, కొంతమంది ఏడిపించడానికి, మరికొంతమంది వినోదాన్ని పంచడానికి, ఇంకొంతమంది ఆలోచింపచేయడానికి సినిమాలు తీస్తారు. కానీ, ఔరా... అనిపించేలా సినిమాలు తీసే దర్శకుడు రాజమౌళి. చరిత్ర సంబంధ చిత్రాల్లో నటించాలన్నది నా చిరకాల కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది.సత్యరాజ్ కంటిన్యూ చేస్తూ...

సత్యరాజ్ కంటిన్యూ చేస్తూ...


ఇంత బ్రహ్మాండమైన చిత్రంలో నటించామంటే మేమంతా చాలా కష్టపడ్డామనుకుంటారు. కానీ, రాజమౌళి ప్రీ ప్లానింగ్‌ ప్రిపరేషన్‌తో మా పనిని సులభం చేశారు. ప్రతి చిన్న విషయాన్ని ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. అతని అంకితభావమే ఈ సినిమా కోసం పనిచేసినవారందరికీ స్ఫూర్తి. హాలీవుడ్‌లో కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారనడంలో సందేహం లేదు.నాజర్ మాట్లాడుతూ...

నాజర్ మాట్లాడుతూ...


బాహుబలి... భారతదేశంలోనే అతిపెద్ద మోషన్‌ పిక్చర్‌ సినిమా. చరిత్ర నేపథ్యంతో జానపద హంగులతో అత్యంత బ్రహ్మాండంగా రూపొందుతున్న మహా మూవీ. ‘ఈగ తరువాత దర్శకుడు రాజమౌళి తీస్తున్న డైనోసార్‌ ఇది'...English summary
The Tamil theatrical rights of SS Rajamouli's Baahubali have been bagged by Studio Green and hence the most expected film of recent times will enter every nook and corner of Tamil Nadu on its release day. As a part of their promotions, Studio Green has planned to released the theatrical trailer(Tamil version) in a grand manner at a star hotel in Chennai amidst many prominent Kollywood celebrities.
Please Wait while comments are loading...