For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మా అభమాన హీరోని చూడనివ్వందే వెళ్లమంటూ...

  By Srikanya
  |

  చెన్నై: అభిమానులు లేనిదే సూపర్ స్టార్స్ , మెగా స్టార్స్ లేరనేది వారు కూడా ఒప్పుకునే నిజం. అందుకే అభిమానులు తమను చూడాలని వస్తే తప్పుకుండా కనిపించి,వారిని పలకరిస్తూంటారు. రీసెంట్ గా...దీపావళి పండుగ రోజున తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఇంటికి అభిమానులు క్యూకట్టారు. తన అభిమాన నటుడు రజినీకాంత్‌ను కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినట్లు తెలిపారు.

  రజనీను చూడకుండా తాము ఇక్కడి నుంచి వెళ్లేది లేదని ఇంటి వద్ద కూర్చున్నారు. దీంతో రజినీ ఇంటి వద్ద ఉన్న సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయాన్ని రజినీకాంత్‌కు చేరవేశారు. వారి కోరికను మన్నించిన రజినీ ఇంటి మేడపైకొచ్చి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

  మరో ప్రక్క భాజపా తీర్థం పుచ్చుకొనే వ్యవహారంలో నటుడు రజనీకాంత్‌ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్‌ను తమ పార్టీలో చేరాలంటూ తాము ఎన్నటికీ బలవంతం చేయటం లేదన్నారు. ఆయన సర్వం తెలిసినవారన్నారు. ఆధ్యాత్మికం, దేశభక్తి కలిగిన ఆయనకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయనకు తెలుసన్నారు.

  Rajani Fans on Deepavali Day

  ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం దేశానికి పలు ఉన్నత సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

  రజనీ తాజా చిత్రం లింగా విషయానికి వస్తే...

  రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లింగా'. ఇందులో సూపర్‌స్టార్‌ రజినికాంత్‌ హీరోగా నటిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతు న్నారు.

  ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నీ తెరకెక్కించారు. ఇటీవల క్లెమాక్స్‌ సన్నివేశాలను కర్ణాటకలో తెరకెక్కించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వినాయకచవితి సందర్భంగా 14 సెకన్ల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్‌ నడిచిస్తున్నట్టుగా ఉన్న ఫొటో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. రజినీ ఇందులో మరింత స్టెల్‌గా కనిపిస్తున్నారన్నది ఆయన అభిమానుల మాట.

  ఇదిలా ఉండగా పాటల చిత్రీకణ కోసం చిత్ర యూనిట్‌ త్వరలో ఐరోపా వెళ్లనుంది. అక్కడ మొత్తం రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఒకటి అనుష్క, రజినీకాంత్‌ కలయికలో కాగా.. మరోటి రజిని- సోనాక్షి జంటగా. ఇందుకోసం రజినీకాంత్‌, అనుష్క, సోనాక్షి, కేఎస్‌ రవికుమార్‌, కెమెరామెన్‌ రత్నవేల్‌ (రాండి) తదితర చిత్ర యూనిట్‌ ఐరోపా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా పాటలను రజినీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

  దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్నిటిని ఈ సినిమాలో చర్చించే అవకాసం ఉందని అంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలి అనే అంశంతో కథనం నడుస్తుందని అంటున్నారు. 'లింగా' అనేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర పేరు అని, అలాగే ప్రారంభం నుంచి యువకుడైన రజనీ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. విలన్ గా జగపతిబాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. రజనీకాంత్‌ మనవడు (ధనుష్‌- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.

  English summary
  Rajinikanth, who enjoys demi-god status in these parts, has proved it once again. For lakhs of fans all over India celebrated the release of his latest venture 'Linga' first look like Deepavali or New Year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X