»   » రజనీ వార్నింగ్ వర్కవుట్ అయ్యింది, లాభం రెట్టింపు

రజనీ వార్నింగ్ వర్కవుట్ అయ్యింది, లాభం రెట్టింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ వరస ఫెయిల్యూర్స్ లింగ, విక్రమ సింహా ప్రబావంతో ఈసారిచాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయనే అన్ని విషయాలు సమన్వయం చేసుకున్నారు. అందులో భాగంగా బడ్జెట్ కంట్రోలు పెట్టి సక్సెస్ అయినట్లు సమాచారం.

గతంలో రజనీచిత్రం అంటే వంద కోట్లు పెట్టుబడి పెట్టేవారు. అయితే ఈ సారి చాలా స్ట్రిక్టుగా దాన్ని 70 కోట్లుకు కుదించినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం బిజినెస్ పరంగా ఇప్పుడు రెట్టింపు లాభాలు చూసిందని కోలీవుడ్ టాక్. కబాలి ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు అయినట్లు సమాచారం. దాంతో నిర్మాత పూర్తి ఆనందంగా ఉన్నారు.

Rajani's 'Kabali' movie makes Profit

లింగా వివాదాలు, విక్రమ్ సింహా వివాదాలతో విసుగెత్తిన రజనీ ఇలా నిర్ణయం తీసుకుని తనపై జూదం ఆడద్దని హెచ్చరించినట్లు సమాచారం. తక్కువ బిజినెస్ అయినా రేపు సినిమా అటూఇటూ అయితే పెద్దగా నష్టపోయేదమీ ఉండదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Rajani's 'Kabali' movie makes Profit

మొదట ఈ విషయమై నిర్మాత విభేధించినా తర్వాత లాభ,నష్టాలు, పెట్టుబడలను బేరీజులు వేసుకుని దానికి తగినట్లే బిజినెస్ చేసినట్లు చెప్తున్నారు. పి.ఎ రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ డాన్ గా కనిపించనున్నారు. ఆయన సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తోంది.

English summary
Rajinikanth wanted to make 'Kabali' with a reasonable within Rs 70 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu