twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ....ఏమన్నా రామ్ గోపాల్ వర్మా?

    By Srikanya
    |

    చెన్నై : ముల్లె పెరియార్‌ డ్యాం వివాదం తమిళనాడులో రగులుతున్న కాష్టం. అయితే ఈ వివాదాన్ని రజనీకాంత్ మోయనున్నాడా అంటే అవుననే వినిపిస్తోంది. ఆయన తన తాజా చిత్రం లింగ కోసం ఈ సబ్జెక్టునే ఎన్నుకున్నాడని తమిళ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. నిజంగా ఈ సబ్జెక్టు మీద ఆయన సినిమా చేస్తే కోరి వివాదం కొని తెచ్చుకున్నట్లే. రజనీకాంత్ మొదటినుంచీ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో అసలు ఈ సబ్జెక్టు మీద నిజంగా ఆయన సినిమా చేస్తున్నారా లేక కావాలని కొందరు ఈ తరహా ప్రచారం చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా చేస్తే ఆయన రామ్ గోపాల్ వర్మ రూటులో ప్రయాణం పెట్టుకున్నట్లే. అయితే రజనీకాంత్ కు అలా వివాదాలతో లబ్ది పొందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నది నిజం.

    ఇక ముల్లె పెరియార్‌ డ్యాం డ్యామ్ ను బెన్ని క్విక్ అనే ఆంగ్లే య ఇంజినీర్ నిర్మించారు. ఈ డ్యామ్ నిర్మాణం కారణంగా పలు భూములు సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉంది. నీటి ఒత్తిడి పెరిగితే కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. దీని నేపథ్యంలో సాగే లింగా చిత్రంలో రజనీ ఆంగ్లేయ ఇంజినీర్ బెన్ని క్విక్‌గా నటిస్తున్నారని, వ్యవసాయ సాగు కోసం డ్యామ్‌ను నిర్మించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

    Rajani's Linga touching controversial subject?

    మరోప్రక్క ఆయన కొడుకుగా మరో పాత్రను నవతరం యువకుడిగా రజనీ నటిస్తున్నారట. ప్రస్తుత శిథిలావస్థకు చేరుకున్న డ్యామ్‌ను పునర్నిర్మించడానికి పోరాడే పాత్ర ఇదని తెలుస్తోంది. ఈ చిత్రం లో హాస్యనటులు వడివేలు, సంతానం ఇద్దరు రజనీ కాంత్‌లతో నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో రజనీ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

    మరో ప్రక్క డ్యామ్ విషయంలో తనపై విమర్శలు సంధించకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తదుపరి చర్యలపై దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి జయలలితకు డీఎంకే అధినేత కరుణానిధి సూచించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో తమ ప్రభుత్వ హయాంలో ఈ డ్యాం విషయంలో కేరళతో నిర్విరామంగా చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. 2000లో తాను స్వయంగా తిరువంతపురం వెళ్లి అప్పటి కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌తో తమిళనాడుకు లబ్ధి చేకూరేలా చర్చించానని గుర్తు చేశారు.

    సుప్రీంకోర్టు సూచనలతో ఇరు రాష్ట్రాలకు చెందిన వారితో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. 2001లో సదరు కమిటీ నివేదికను సమర్పించగా.. అదే సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారపగ్గాలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా జయలలిత తమపై విమర్శలు సంధించటం సమంజసం కాదన్నారు. తాజాగా వెలువడిన తీర్పుతో డ్యాం మట్టాన్ని 142 అడుగులకు పెంచేలా జయలలిత దృష్టి పెట్టి రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలని సూచించారు. తాగునీటికీ ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.

    దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్నిటిని ఈ సినిమాలో చర్చించే అవకాసం ఉందని అంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలి అనే అంశంతో కథనం నడుస్తుందని అంటున్నారు. 'లింగా' అనేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర పేరు అని, అలాగే ప్రారంభం నుంచి యువకుడైన రజనీ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. విలన్ గా జగపతిబాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. రజనీకాంత్‌ మనవడు (ధనుష్‌- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.

    English summary
    Super Star Rajinkanth's ‘Lingaa’ directed by KS.Ravikumar is progressing at brisk pace in Karnataka. Buzz is Rajini will be seen as an engineer who constructed the Mullaiperiyar dam which makes Tamil Nadu fertile. Rajini will be seen as son of the engineer in another role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X