»   » కొత్త ఆలోచన: విలన్ గా రజనీకాంత్

కొత్త ఆలోచన: విలన్ గా రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : రజనీకాంత్ విలన్ గా చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీవర్గాలు. శంకర్ దర్సకత్వంలో రూపొందనున్న రోబో 2 చిత్రంలో ఆయన విలన్ గా చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అది తమిళ, తెలుగు వెర్షన్స్ కోసం కాదని అంటున్నారు. కేవలం హిందీ వెర్షన్ లోనే రజనీ విలన్ గా కనిపించి అలరిస్తాడంటున్నారు. అదే తెలుగు,తమిళానికి వచ్చేసరికి రజనీ హీరోగా చేస్తారు....మరి ఆయనకు విలన్ ఎవరూ అంటే షారూఖ్ ఖాన్ అంటున్నారు. ఇదేం లెక్క అంటారా...అయితే ఇది పూర్తి గా చదవాల్సిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

షారూఖ్ అంటే రజనీకి ఇష్టమే. అందుకే షారుక్ నటించిన 'రా. వన్'లో ఒకే ఒక్క సన్నివేశంలో కనిపించడానికి అంగీకరించారు రజనీ. ఇప్పుడు ఈ ఇద్దరూ హీరో, విలన్లుగా తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం 'రోబో-2' లో నటించనున్నారని సమాచారం. తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందట.

Rajani Villan in Shahrukh Khan's 'Robot 2'

తమిళ చిత్రంలో రజనీ హీరోగా, షారుక్ విలన్ గా కనిపిస్తారట. కానీ, హిందీ వెర్షన్‌కు వచ్చేసరికి ఒకరి పాత్రలు మరొకరు మార్చుకొని, షారుక్ నాయకునిగా, రజనీ ప్రతినాయకునిగా చేస్తారట. ఇది ఇలా ఉంటే, ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, విక్రమ్‌లతో శంకర్ ప్లాన్ చేశారనీ, ఆ తర్వాత సీన్‌లోకి రజనీ, షారుక్ వచ్చారనీ చెన్నై టాక్.

కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్. తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది.

Rajani Villan in Shahrukh Khan's 'Robot 2'

అయితే ఇప్పుడు తమిళంలో పెద్ద నిర్మాత అయిన జ్ఞానవేల్ రాజా ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నట్లు చెన్నై సినీ వర్గాల సమాచారం. ఎందుకంటే తమ స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ...సూర్య హీరోగా ఓ చిత్రం డైరక్ట్ చేయటానికి రంజిత్ ఎగ్రిమెంట్ రాయటం జరిగింది. దాంతో ఇప్పుడు ఆ ఎగ్రిమెంట్ ని ఉల్లంఘించి...రజనీ ని డైరక్ట్ చేయటమేంటని ప్రశ్నిస్తున్నాడు జ్ఞానవేల్ రాజా.

ఈ మేరకు జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని సైతం రజనీకాంత్ సమక్షానికి తెలియచేసినట్లు చెప్పుకుంటున్నారు. దాంతో దర్శకుడు రంజిత్ డీలా పడిపోయారు. ఎగ్రిమెంట్ ని కాదని రజనీతో సినిమా చేస్తే వారు ఒప్పుకునేటట్లు లేరు. అలాగని రజనీలాంటి సూపర్ స్టార్ హీరోతో ఒక్కసారి సినిమా చేసే అవకాసం మిస్తైతే ఇక మరోసారి ఇలాంటి అవకాసం రావటం కష్టం. ఈ విషయంలో రజనీ ఏం నిర్ణయం తీసుకుంటారు..ఏ విధంగా సమస్య పరిష్కారమవుతుందనే విషయమై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
Rajanikanth will be doing as a villan in Sharukh Khan's Robo 2 movie.
Please Wait while comments are loading...