»   » దటీజ్ రజనీ...'కబాలి' రైట్స్ రేటు కేక

దటీజ్ రజనీ...'కబాలి' రైట్స్ రేటు కేక

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్ కేవలం ఇక్కడ మన దక్షిణాది రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయన కొత్త చిత్రం వస్తోందంటే బిజినెస్ ఓ రేంజిలో జరుగుతుంది. లింగా వంటి డిజాస్టర్ తర్వాత కూడా ఆయన ఓవర్ సీస్ మార్కెట్ కొంచెం కూడా తగ్గలేదని రీసెంట్ గా జరిగిన కబాలి బిజినెస్ ప్రూవ్ చేసింది.

రజనీకాంత్ హీరోగా, రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'కబాలి'. తెలుగులో కూడా ఇదే పేరుతో డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించి బిజినెస్ కూడా చాలా జోరుగా సాగుతోంది. తెలుగు తమిళ వెర్షన్స్ కిలిపి సుమారు 8.5 కోట్లకు యు.ఎస్. రైట్స్ వెళ్లాయని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ సినిమా ప్రస్తుతం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటోంది. పిభ్రవరి 28 వరకు ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూగా జరుగుతుందని నిర్మాత కలైపులి ఎస్ ధాసు తెలిపారు.

Rajanikanth Kabali Telugu, Tamil US Rights

అలాగే ...తమిళంలోను, తెలుగులోనూ మే 1న రిలీజ్ చేయ్యాడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను వి క్రియోషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ ధాసు నిర్మిస్తుండగా, దీనిని పా.రంజిత్ డైరక్షన్ చెస్తున్నారు.

ఈ సినిమా తెలుగు వర్షన్ కు సంబందించి సంగీత దర్ళకుడు సంతోష్ నారాయన్ తనదైన శైలిలో పాటలను సిరివెన్నెల, చంద్రబోస్ మరియు అనంత శ్రీరామ్ చేత లిరిక్స్ రాయిస్తున్నాడు. ఆడియో ఇక్కడ కూడా మంచి హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

English summary
Producer Kalaipuli S.Thanu who is producing the film on V Creations Banner said the film's US theatrical rights along with Telugu and Tamil versions were sold for a whopping sum of Rs Rs 8.5crs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu