»   » సూపర్ స్టార్ కి తప్పని సేఫ్ గేమ్ : ఒకేసారి రెండు చిత్రాల్లో..!

సూపర్ స్టార్ కి తప్పని సేఫ్ గేమ్ : ఒకేసారి రెండు చిత్రాల్లో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : లింగా భారీ ఫ్లాఫ్ కావటం, వెను వెంటనే వివాదాలు చుట్టముట్టడంతో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తదుపరి చిత్రానికి సంబంధించిన ఏ వార్త అయినా తెలుగు,తమిళ పరిశ్రమలో ఆసక్తిని రేపుతోంది. ఈసారి ఏ దర్శకుడుతో ఆయన ముందుకు వల్లనున్నాడు...సేఫ్ గా ఉండటానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అనేదానిపైనే అందరి దృష్టీ. అయితే అందుతున్న సమాచారం ప్రకారం...రజనీకాంత్ సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అందులో భాగంగా ఒకేసారి రెండు చిత్రాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. అవి కూడా ఒకటి భారీ చిత్రం... మరొకటి మార్కెట్ కు తగిన లిమెటెడ్ బడ్జెట్ చిత్రం. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తమిళ సినీ పరిశ్రమలో వినపిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే...

Rajanikanth safe game... two movies same time

ఇటీవలే శంకర్‌ చిత్రానికి ఓకే చెప్పినట్లు వార్తలు రాగా... తాజాగా వర్తమాన దర్శకుడు రంజిత్‌ దర్శకత్వంలోనూ నటించడానికి రజనీకాంత్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 'అట్టకత్తి' చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దర్శకుడు రంజిత్‌. ఆ తర్వాత కార్తి హీరోగా 'మెడ్రాస్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు రంజిత్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి.

ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న కథను ఇటీవల వినిపించినట్లు సమాచారం. అందుకు సూపర్‌స్టార్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, దీంతో ఒకే సమయంలో రెండు సినిమాల్లో రజనీ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని రజనీకాంత్‌కు 'సూపర్‌ స్టార్‌' అనే కిరీటాన్ని అలంకరించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్‌.థాణు నిర్మించనున్నట్లు వినికిడి.

ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని రజనీకాంత్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

English summary
With lot of speculation doing the rounds about superstar Rajinikanth's next film, the latest buzz doing the rounds in K-town is that the superstar would be teaming up with director Pa Ranjith of 'Attakathi' and 'Madras' fame. While the there was talks that Rajinikanth would be doing 'Endhiran 2' with ace director Shankar, looks like he wants to do two movies in same time.
Please Wait while comments are loading...