»   » తేడా వస్తే...350 కోట్ల ఇన్సూరెన్స్ మనీ వస్తుంది

తేడా వస్తే...350 కోట్ల ఇన్సూరెన్స్ మనీ వస్తుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: భారీగా ఖర్చు పెట్టేడప్పుడు ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే పరిస్దితి ఏమిటి...ఆ విషయం గమనించే భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు ఇన్సూరెన్స్ చేస్తున్నారు.

తాజాగా సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. ఈ చిత్ర మరేదో కాదు రోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.ఓ. తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

రజనీ కబాలి షూటింగ్ దాదాపు పూర్తి కావటంతో ..ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లకు రెడీ అయ్యింది. అందుకోసం నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు భారీ సెట్స్ వేసారు. వారు తాము రిస్క్ తీసుకవటానికి రెడీగా లేమని చెప్తున్నారు.

Rajini 2.0 gets insured assured of success

షూటింగ్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంన్నా, టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినా, స్టోరీ లైన్ బయిటకు వెళ్లకుండా నిరంతరం నిఘా పెడుతున్నా, ఈ ఇన్సూరెన్స్ ని అనుకోని అవాంతరాల నుంచి కాపాడటానికి తీసుకుంటన్నామని చెప్తున్నారు.

గతంలో కమల్ దశావతారం, ఇదే కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రాలకు ఈ స్దాయిలో ఇన్సూరెన్స్ చేయించారు. అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించడం విశేషం.

నీరవ్‌షా చాయాగ్రహణం, ఏఆర్.రెహ్మాన్ సంగీతంతో పాటు, హాలీవుడ్ సాంకేతికనిపుణులు పనిచేస్తున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ రూ.350 కోట్లతో బ్రహ్మాండంగా నిర్మిస్తోంది. విదేశీ స్టంట్ మేన్స్, మేకప్ టీమ్, అద్బుతమైన సెట్స్ తో కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం.

English summary
Lyca has insured 2.0, the sequel of ROBO sets along with the film for a wooping amount of 350 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu