»   »  రజనీ, కమల్ ఒకే సినిమాలో?

రజనీ, కమల్ ఒకే సినిమాలో?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajini-Kamal
అవును...ఇప్పుడు వారిద్దరూ ఒకే సినిమాలో చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి చేతులమీదుగా ఓపెన్ అయిన ఓ భారీ బడ్జెట్ సినిమాలో ఈ అధ్భుతం జరిగే అవకాశం ఉంది. దాదాపు యాభై కోట్ల బడ్జెట్ తో 'సెయింట్ థామస్' టైటిల్ తో జీసస్ క్రీస్తు జీవింతం ఆధారంగా ఈ తమిళ చిత్రం రూపొందుతోంది. 'బెనహర్', 'టెన్ కమాండ్ మెంట్స్' తరహాలో ఈ చిత్రాన్ని హై క్వాలిటీగా చరిత్రలో నిలబడిపోయేటట్లు తీయాలని నిర్మాతగా వ్యవహరించనున్న Archdiocese of Madras-Mylapore అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో తమిళంలో పేరున్న పెద్ద నటులు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విక్రమ్, విజయ్ లను గెస్ట్ లుగా అడుగుతున్నారు. ధనాపేక్ష లేకుండా ఓ మంచి సందేశంతో వచ్చే ఈ సినిమాలో చేయటం తమకే గర్వ కారణమవుతుందని ఆ హీరోలు ఫీలవుతున్నారట. అంతేగాక ఈ సినిమా మొదట తమిళంలో చేసి ఆ తర్వాత మళయాళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ప్రెంచ్ భాషల్లోకి డబ్ చేస్తారట. కెనడా, వియత్నాం గవర్నమెంట్స్ ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేస్తాయట. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టు మెటీరిలైజ్ అయితే తమ హీరోలందరినీ ఒకేసారి చూసే అవకాశం కలుగుతుందని తమిళ తంబీలు సంబరపడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X