»   » కరుణానిధిపై పాటకు గళం కలుపనున్న రజనీ, కమల్

కరుణానిధిపై పాటకు గళం కలుపనున్న రజనీ, కమల్

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిపై రంగస్ధలం మీద పాటపాడేది ఫిబ్రవరి 6న అంటేరేపే. ఈ పాటను హారిస్ జయరాజ్ స్వరపరిచారు. ప్రముఖ గీత రచయిత వాలి పాట రాశారు. ఉన్ని మీనన్, టిప్పు, హరిచరణ్, దేవన్, విజయ్ గోపాల్, చిన్మయి, చారులత, మధుమిత, దివ్య, నేహ, నటీషా నేపధ్య గాయకులు.

రేపు కరుణానిధికి మొత్తం తమిళ సినిమారంగం సన్మానం చేయనున్న సందర్భంగా ఈ పాటను ఎంతో గ్రాండ్ గా రూపొందించారు. పాట వస్తుండగా రజనీకాంత్, కమల్ హసన్, శరత్ కుమార్, ఇంకా ఇతర సినిమారంగ ప్రముఖులు గళం కలుపుతారు. కరుణానిధి వంటి రాజకీయ, సినీరంగ దురంధరుడిపై ఒక పాటను స్వరపరచడం అదృష్టంగా భావిస్తున్నానని హారిస్ జయరాజ్ చెప్పారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu