»   » ట్రైలర్ చూసి రజనీ,కమల్ అభినందనలు

ట్రైలర్ చూసి రజనీ,కమల్ అభినందనలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై: ఆలిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్‌ తొలినాళ్లలో హీరోగా వచ్చిన చిత్రం 'తిల్లుముల్లు'. అన్నివర్గాలను కడుపుబ్బా నవ్వించింది. ప్రస్తుతం అదే పేరుతో రీమేక్‌ సిద్ధమవుతోంది.శివ హీరో. ఇషా తల్వార్‌ హీరోయిన్. ఎస్‌.మదన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ చూసి రజనీ పర్శనల్ గా ఫోన్ చేసి అభినందించారని, శివ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.


శివ మాట్లాడుతూ.. 'జైహింద్‌' పునర్నిర్మించాలని ప్రారంభంలో అనుకున్నాం. ఆ తర్వాత దెయ్యం సినిమా చేద్దామని ఆలోచించాం. చివరకు జనాల్ని హాయిగా నవ్వించాలని 'తిల్లుముల్లు'ను ఎంపిక చేసుకున్నాం. ఇందుకోసం దర్శకులు కె.బాలచందర్‌ వద్ద అనుమతి తీసుకున్నాం.

ఆ తర్వాత రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ను కలిశాం. దర్శకత్వానికి బద్రిని సిఫార్సు చేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజం కాదు. 'కలగలప్పు'లో ఆయన మాటలు ఎంతగానో ఆకర్షించాయి. ఆ ప్రతిభే దర్శకుణ్ని చేసింది. సిఫార్సు ద్వారా వచ్చేవారు పరిశ్రమలో నిలదొక్కుకోలేరు. మెగాఫోన్‌ పట్టుకునే అర్హత ఉందా? లేదా? అన్న విషయం చిత్రీకరణ ప్రారంభమైన రెండు రోజుల్లో తేటతెల్లమవుతుంది.


ప్రస్తుతం బద్రి పనితీరును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రేక్షకులను కూడా అలరించేలా 'తిల్లుముల్లు' రీమేక్‌ ఉంటుందని చెప్పారు. ఇందులో ప్రకాశ్‌రాజ్‌, సంతానం, సత్యన్‌, కోవై సరళ తదితరులు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఇందులో నటిస్తున్నందుకు శివను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభినందించారు. ప్రచారచిత్రాన్ని చూసి 'చక్కగా తెరకెక్కిస్తున్నారు' అని కితాబిచ్చారు.

English summary
Rajinikanth, Kamal hassan and director K.Balachander wishes Thillumullu remake team.Shiva and Isha Talwar acting in the lead role.Director Badri is directing the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu