»   » అదరకొడ్తూ రజనీ... ( 'లింగా' పూజ ఫొటోలు)

అదరకొడ్తూ రజనీ... ( 'లింగా' పూజ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మైసూరు: రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన తాజా చిత్రం లింగా ఈ రోజే ప్రారంభమైంది. రజనీకాంత్ నటించిన విక్రమ సింహ (తమిళంలో కొచ్చాడయాన్) ఇంకా విడుదల కాకముందే మరో సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా రజనీ కొత్తసినిమా 'లింగా' ప్రారంభమైంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ తో పాటు సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా పాల్గొన్నారు. తెల్ల సిల్కు లుంగీ, తెల్ల చొక్కా వేసుకుని వచ్చిన రజనీకాంత్ తో పాటు ఆయన స్నేహితుడు, కన్నడ సూపర్ స్టార్ అంబరీష్, ఆయన సతీమణి సుమలత కూడా పూజా కార్యక్రమానికి వచ్చారు.

మైసూరులోని ప్రఖ్యాత చాముండేశ్వరి ఆలయంలో ఈ పూజలు జరిగాయి. సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమాలో రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క ఇద్దరూ నటించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

రజనీ చిత్రం ప్రారంభం రోజు ఫ్యాన్స్ కు పండగే. చిత్రం విజయవంతం కావాలని కొన్ని చోట్ల పూజలు సైతం చేస్తూంటారు. ఇప్పటికే విక్రమ్ సింహా చిత్రం పై మంచి అంచనాలు పెట్టుకుని విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ కొత్త చిత్రం మరింత ఊపుని ఇచ్చింది. విక్రమ్ సింహా అనంతరం ఆయన రిటైర్ అయిపోతారేమో అనే సందేహాలకు తెరపడినట్లైంది.

రజనీకాంత్

రజనీకాంత్

ఈ వయసులోనూ హీరోగా ఇరగదీస్తున్న తమిళ స్టార్ హీరో రజనీకాంత్ మరో సంచలన చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికీ ఆయనలో ఎనర్జీ లెవల్స్ ఓ రేంజిలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

లింగా

లింగా

‘లింగా' చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే లేదా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నారని తెలుస్తోంది.

కెఎస్ రవికుమార్

కెఎస్ రవికుమార్

కెఎస్ రవి కుమార్, రజనీకాంత్ కాంబినేసన్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. గతంలో రజనీ నటించిన ముత్తు, నరసింహ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కెఎస్ రవికుమార్...‘కొచ్చాడయాన్'చిత్రానికి స్టోరీ కూడా సమకూర్చారు.

సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి

సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి

రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క షెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండుసార్లు ఆస్కార్ అవార్డు సాధించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

English summary
Rajinikanth "Kochadaiyan" (Vikramasimha) is readying for release on May, 9th in a grand manner and Rajini is getting ready for his next under the direction of KS.Ravikumar which was tentatively titled as “Linga” . The film was launched on today (May 2nd 2014) morning at the Chamundeeshwari temple in Mysore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more