For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరాయి : రజనీ కొత్త చిత్రం పోస్టర్స్

  By Srikanya
  |

  రజనీకాంత్‌ తాజా చిత్రానికి 'అట్టకత్తి' దర్శకుడు రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్‌ నిమగ్నమైన సంగతి తెలిసిందే. పలు టైటిళ్ల పరిశీలన తర్వాత 'కబాలి' అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్‌' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్‌ ఒరిజినల్‌ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

  ఈ చిత్రం గురించి రజనీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిత్రంలో కథేమిటి...రజనీ పాత్ర ఎలా ఉండబోతోందనేది, ముఖ్యంగా రజనీ గెటప్ ఎలా ఉంటుంది హాట్ టాపిగా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఉన్న కొన్ని పోస్టర్స్ ని రెడీ చేసి వదిలారు. వాటిని ఇక్కడ చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  తాజాగా అందిన సమాచారం ప్రకారం రజనీ తన సొంత గెడ్డంతో ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం తొలి విడత చిత్రీకరణను మలేషియాలో చేపట్టాలని నిర్ణయించి అక్కడ లొకేషన్లు కూడా ఎంపిక చేశారు. రెండో విడత చిత్రీకరణను చెన్నైలో చేపట్టడానికి నిర్ణయించారు.

  ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. మరిన్ని వివరాలు కోసం క్రింద స్లైడ్ షో చూడండి.

  ఎందుకంటే...

  ఎందుకంటే...

  దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

  నిజ జీవితం నుంచి...

  నిజ జీవితం నుంచి...

  కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు.

  దేముడుగా కొలిచే

  దేముడుగా కొలిచే

  వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

  రజనీకూతురుగా చేస్తున్న మాట్లాడుతూ...

  రజనీకూతురుగా చేస్తున్న మాట్లాడుతూ...

  దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.

  కార్తిక్ సుబ్బరాజు తండ్రి

  కార్తిక్ సుబ్బరాజు తండ్రి

  దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు

  రజనీ రిక్వెస్ట్

  రజనీ రిక్వెస్ట్

  తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం.

  వినాయిక చవితి నుంచి

  వినాయిక చవితి నుంచి

  ప్రస్తుతం తొలి విడత చిత్రీకరణ చెన్నైలో చేపట్టాలని, వినాయక చవితి సందర్భంగా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలివుడ్‌ సమాచారం.

  ఫస్టు లుక్

  ఫస్టు లుక్

  షూటింగ్ ముందుగా సెప్టెంబరు 17న చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు.

  హీరోయిన్ తో ఫొటో షూట్

  హీరోయిన్ తో ఫొటో షూట్

  హీరోయిన్ రాధికా ఆప్టే తో ఫార్మల్ ఫోటో షూట్ నిర్వహించినట్లు సమాచారం.

  మేకప్ లేకుండా

  మేకప్ లేకుండా

  ఇందులో రజనీకాంత్‌ అసలైన రూపంలో అంటే మేకప్ లేకుండానటిస్తున్నారని ఆదివారం నుంచి ప్రచారమవడంతో దీనికి సంబంధించిన ఫ్యాన్స్‌మేడ్‌ ఫొటోలు కూడా దర్శనం ఇస్తున్నాయి.

  ఫ్లాష్ బ్యాక్ లో

  ఫ్లాష్ బ్యాక్ లో

  సినిమాలో ఒరిజనల్ లుక్ తో మేకప్ లేకుండా కనపడినా ...ఫ్లాష్ బ్యాక్ సీన్లలో మాత్రం మేకప్ వేసి లుక్ మారుస్తారని చెప్తున్నారు.

  దర్శకుడు గురించి

  దర్శకుడు గురించి

  ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్.

  నిర్మాత ఎవరంటే...

  నిర్మాత ఎవరంటే...

  తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు.

  తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.

  English summary
  Here are few designs of Rajinikanth's look in Kabali movie made by his die hard fans. Kabali it is said, is about these labourers and their possible connection with an Indian don, played by 'Thalaivar' Rajinikanth in his most convincing avatar till date. The next Rajinikanth film, which will be directed by Pa. Ranjith, will be called Kabali and he will be reportedly playing the role of a don in the film. Director said that Rajinikanth's new film will bring back Rajini, the actor, onscreen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X