twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్:'రజనీ పంచ్‌తంత్ర'

    By Srikanya
    |

    సినిమాల్లో రజనీకాంత్ చెప్పే డైలాగులకు ప్రత్యేకమైన స్దానం ఉంది. ఆ తరహా పంచ్ డైలాగులు ఏ స్టార్ హీరో సినిమాల్లోనూ ఉండవు. అందుకే ఆయన చెప్పే డైలాగులుకు తెలుగు,తమిళ భాషల్లో అంత క్రేజ్. ఇక ఆ డైలాగులు ఎంత పాపులర్ అంటే లైఫ్ లో ఎలాంటి సందర్భంలో అయినా అనుకోకండా అవి వచ్చేస్తూంటాయి. అందుకే ఆ పంచ్ డైలాగులన్నిటినీ కలిపి ఓ పుస్తకం చేయాలనుకున్నారు ఆయన అభిమానులు. వాటిని సేకరించి ఇటీవల జరిగిన రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆ పుస్తకాన్ని విడుదల చేసారు. ఆ పుస్తకం పేరు 'రజనీ పంచ్‌తంత్ర'. ఈ పుస్తకం విడుదలైన వెంటనే రజనీ అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఆ పుస్తకంలో 'సింహం సింగిల్‌గా వస్తుంది...', 'అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు' లాంటి పంచ్‌ డైలాగులు ఉన్నాయి. అయితే పుస్తకం తమిళంలో ఉంటుంది.

    ఇక ప్రస్తుతం రజనీకాంత్ 'కొచ్చాడయాన్‌'అనే ఓ త్రీడీ చిత్రం చేస్తున్నారు.తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్‌ క్యాప్చరింగ్‌ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్‌', 'ద అడ్వెంచర్‌ ఆఫ్‌ టిన్‌టిన్‌' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక 'రాణా'సినిమా రజనీకాంత్ చేయాలని ఆయన అనుకున్నా హెల్త్ సమస్యలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.

    English summary
    P.C. Balasubramanian’s maiden writing venture is the book called Rajini’s PUNCHtantra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X