»   » అఫీషియల్: 'రోబో' సీక్వెల్ టైటిల్ మార్చారు

అఫీషియల్: 'రోబో' సీక్వెల్ టైటిల్ మార్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజినీకాంత్‌, ఐశ్వర్య రాయ్‌ల కాంబినేషన్‌లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ రానుంది. ఈ సినిమాకి కూడా శంకరే దర్శకత్వం వహించనున్నారు.

ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ సీక్వెల్ చిత్రానికి టైటిల్ 'రోబో-2' అనే ప్రచారం జరుగుతోంది. అది కాదని దర్శకుడు శంకర్ ట్వీట్ తో తెలియచేసారు. ఆ టైటిల్ ఏంటో ఇక్కడ చూడండి.

ఇక ఈ చిత్రంలో రజినీకాంత్‌కి జంటగా అమీ జాక్సన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా అమీ శరీరాకృతికి తగ్గట్టు ప్రత్యేక దుస్తులు కూడా డిజైన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం మాఫియా దాన్‌గా చేస్తున్న కబాలి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గతకొద్ది రోజులుగాఈసినిమా మలేసియా, బ్యాంకాక్‌ లలో కబాలి షూటింగ్ జరుగుతోంది. కానీ ఈ చెన్నై షెడ్యూల్‌ కోసం రజనీకాంత్‌ ఓ స్మాల్‌ బ్రేక్‌ తీసుకోనున్నారు.

Rajini’s Robo 2 titled Robo 2.0

3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా చేసి ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్‌ నుంచిఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకేటైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నారు. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాసం ఉంది.

English summary
Shankar also made it clear that the film’s regular commences on Wednesday (Dec 16). Shankar tweeted, "2.0 shoot starts from tomorrow.. Excited!!!"
Please Wait while comments are loading...