twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ తెచ్చిన డబ్బు తో రజనీకాంత్ కు రిలీఫ్

    By Srikanya
    |

    చెన్నై : ఏ ముహూర్తాన రజనీకాంత్ ... 'లింగ' చేసారో కానీ ...ఆ చిత్రం మొదట నుంచి చివరి వరకూ రకరకాల తలనొప్పిలే. రిలీజయ్యాక కూడా ఆ సినిమా తాలుకూ నష్టాలు ...వివాదాలు రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. రజనీకాంత్ వచ్చి సెటిల్ చెయ్యాలని డిస్ట్రిబ్యూటర్స్ కోరటం,డిమాండ్ చేయటం జరిగింది. అయితే ఆ తలనొప్పుల నుంచి ఆయన బయిటపడినట్లే. ఆయన లింగా సమస్యని పరిష్కరించారని అక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటన చేసింది. పదికోట్ల రూపాయలకు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సెటిల్ చేస్తానని ఎగ్రిమెంట్ చేయటంతో ఈ సమస్య నుంచి విముక్తి లభించింది

    ఇక రాక్ లైన్ వెంకటేష్ ..గతంలో రవితేజ తో పవర్ చిత్రం చేసారు. బాబీని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం మంచి హిట్ అయ్యి...లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో ఆ లాభాలు...ఇప్పుడు రజనీ చిత్రం అప్పులు కోసం ఖర్చు పెట్టినట్లైంది అంటున్నారు.

    Rajini solved Lingaa issue - Producer Council announced

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    గతంలో ఈ చిత్రం వివాదం ఇలా సాగింది..

    రీసెంట్ గా 'లింగ' నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, నటుడు రజనీకాంత్‌పై క్రిమినల్‌కేసు నమోదు చేసేలా పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఈ సినిమా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.21 కోట్లు గండి పడిందని అందులో ఆరోపించారు.

    మానినా పిక్చర్స్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ ఆర్‌.సింగారవడివేలన్‌ ఈ వ్యాజ్యం వేశారు. తమిళం, తమిళాషాభివృద్ధి సంబంధిత శీర్షికలకు మాత్రమే వినోదపు పన్ను మినహాయింపు ఉందని గుర్తుచేశారు. 'లింగ' సంస్కృత పదమని పేర్కొన్నారు. రజనీకాంత్‌ పలుకుబడితోనే పన్ను మినహాయింపు ఇచ్చారని ఆరోపించారు.

    దీనిపై ఈనెల మూడో తేదీన కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసు దాఖలు చేసేందుకు కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు.

    ఇక ... ఓ భారీ చిత్రం ఫెయిల్యూర్ అనేక తలనొప్పులను తీసుకు వస్తుంది. రీసెంట్ గా ...సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ' సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా వల్లా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది నష్టపోయారు. తమకు నష్టపరిహారం ఇవ్వమని వారు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ మేరకు నిర్మాతతో చర్చలు సైతం జరిగాయి..జరగుతున్నాయి.

    కానీ ఈ చర్చల్లో చివరగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తాను 10% మాత్రమే వెనక్కి ఇస్తానని చెప్పడంతో వారు మళ్ళీ ఎదురు దాడికి దిగారు. అందుకే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి సరికొత్తగా వారి నిరసనలు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకే వీళ్ళందరూ రజినీకాంత్ ఇంటివద్ద, లింగా థియేటర్స్ ముందు బిక్షం ఎత్తుకోవాలని నిర్ణయించుకున్నారు. వారంతా సమావేశమయ్యి... ఇక నుంచి రజినీకాంత్ ఇంటి ముందు బిక్షాటన చేయాలని, అలాగే ఏ ఏ థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసారో అక్కడ రోజు అడుక్కోవాలని వారు నిర్ణయించుకున్నారు.

    అంతే కాకుండా ప్రతి సినిమా థియేటర్లో ఒక బిక్షం ఎత్తుకునే ఒక బౌల్ పెట్టి అందులో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ వీలైనంత దానం చెయ్యాలని కోరటం. వాళ్ళు ఇచ్చే డబ్బు మా రికవరీకి కొంతైనా హెల్ప్ అవుతుందని వారు అన్నారు. ఇప్పుడు ఆ సమస్యలు అన్నీ తీరినట్లే.

    English summary
    This evening, the Tamil Film Producers Council has issued a press note stating that Linga producer has finally agreed to reimburse an amount of 10 crores to compensate the loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X