»   »  అంతొద్దు! అంటున్న రజనీ...

అంతొద్దు! అంటున్న రజనీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajinikanth
రజనీకాంత్...పి.వాసు ల క్రేజీ కాంబినేషన్ లో రెడీ అవుతున్న కుసేలన్ (తెలుగు కథానాయుకుడు) చిత్రం రిలీజు వాయిదా పడిన సంగతి తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ తయారీకి లేటయిన ఈ సినిమా ఆగస్టు 8న గానీ...15న గాని ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 1200 ప్రింట్లుతో ప్రపంచమంతటా విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ తన అనుభవంతో పి.వాసు కి ఓ సూచన చేసారని తెలుస్తోంది. అన్ని ప్రింట్లు వేయిటం వల్ల ఎక్కడెక్కడి అభిమానులు మొదటి రోజే సినిమా చూసేస్తారని అది ప్రమాదమని రజనీ హెచ్చరిస్తున్నారు.

అలా చేయటం వల్ల తర్వాత రోజుల్లో తమ సినిమాను అంత రేంజిలో ఆదరించటానికి, అభిమానుల హంగామాకి ఆస్కారముండదని.... ధియోటర్ల వెలాతెలా పోయో అవకాశముందని సోదోహరణాలతో చెప్పారుట. అలాగే ఈ సినిమా ప్రింట్లు తగ్గించమని ఐదారు వందలు మించవద్దని గట్టిగా చెప్పారుట. వాస్తవాన్ని గ్రహించిన పి.వాసు వెంటనే స్పందించి నిర్మాతలుతో మాట్లాడి 540 ప్రింట్లు మాత్రమే మొదట వదలాని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని మన తెలుగు నిర్మాతలు కూడా గ్రహిస్తే పెద్ద సినిమాలకు తెలీయకుండా వచ్చే ఈ ముప్పు తప్పుతుందని సీనియర్లు చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X