»   » ‘రోబో’-2 లో నేను హీరోని కాదంటూ రజనీ సంచలనం, ఎవరెస్ట్ ని మోస్తున్నానంటూ శంకర్ షాకిస్తూ.. (ఫొటోలు)

‘రోబో’-2 లో నేను హీరోని కాదంటూ రజనీ సంచలనం, ఎవరెస్ట్ ని మోస్తున్నానంటూ శంకర్ షాకిస్తూ.. (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: రజనీకాంత్‌-శంకర్‌ ద్వయం నుంచి వచ్చిన 'రోబో' మంచి సక్సెస్ ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపుదిద్దుకుంటోంది. అదే '2.0'. ఈ చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ నిన్న సాయింత్రం (నవంబర్ 20న) విడుదల చేసారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి, మరి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ పంక్షన్ లో విడుదల చేసిన '2.0' ఫస్ట్ లుక్ ఓ రేంజిలో స్పందన వస్తోంది.

  ఈ ఫస్ట్ లుక్ ఈవెంట్ ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమాకు జరగనంత గ్రాండ్ గా జరిగింది. ఈ పంక్షన్ నిన్న సాయింత్రం ఐదు గంటలకు గ్రాండ్ గా మొదలైన రాత్రిదాకా సాగింది... ఈ పంక్షన్ కు సినిమా టీమ్ తో పాటు సల్మాన్ వంటి అనుకోని అతిధులు సైతం విచ్చేసారు. ఈ ఫంక్షన్ కు చెందిన ఫొటోలను ఇక్కడ మీకు అందిస్తున్నాం... చూడవచ్చు.

  మొదటి నుంచి శంకర్‌ సినిమాలంటే లార్జర్‌ దేన్‌ లైఫ్‌ అన్నట్టుగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఆయన తీసిన 'రోబో' చూశాక ఆ అభిప్రాయం నిజమే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పంక్షన్ హంగామా చూసిన తర్వాత ఆ అంచనా కాస్త 'అంతకుమించి...' అన్నట్టుగా మారింది.

  సంచలన విజయం సాధించిన రోబో సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. అమీజాక్సన్‌ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2017 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

  ఎవరితో యుద్దమంటే..

  రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘2.0'.అక్షయ్‌కుమార్‌ ఇందులో విలన్‌పాత్ర పోషిసున్నారు. ‘యుద్ధం మొదలైంది' అంటూ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

  హలో చిట్టీ...

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న ‘2.0' ఫస్ట్‌లుక్‌ను ఆదివారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దీన్ని ట్విట్టర్‌ ద్వారా శంకర్‌ ప్రేక్షకులతో పంచుకున్నారు. రోబోలోని చిట్టీ పాత్ర రూపురేఖలతో ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌లో రజనీ ఆకట్టుకుంటున్నాడు.

  విలన్ వచ్చేసాడు..బీ రెడీ

  ఇందులో బాలీవుడ్‌నటుడు అక్షయ్‌కుమార్‌ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అక్షయ్‌ బ్లాక్‌ క్రో వేషధారణలో ఉన్న ఫొటోలు ఇదివరకే సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి. తాజాగా అక్షయ్‌ సినిమాలోని తన ఫస్ట్‌లుక్‌ని ఫేస్‌బుక్‌లో అధికారికంగా విడుదల చేశాడు. ఇందులో అక్షయ్‌ పసుపు రంగు కళ్లు, భయంకరమైన చేతి గోళ్లతో ఆకట్టుకుంటున్నాడు.

  ఈ సారి కూడా

  ఈ సారి కూడా

  ‘రోబో' సినిమాలో దర్శకుడు శంకర్‌ చిట్టీ పాత్ర ద్వారా చేయించిన హంగామా ప్రేక్షకులెవరూ అంతసాధారణంగా మర్చిపోలేరు. భారతీయ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమా అది. ఇప్పుడు ఆయన దానికి సీక్వెల్‌ రూపొందిస్తున్నారు. ఇందులో చిట్టీ పాత్రే హైలెట్ గా ఉండబోతోంది.

  శంకర్ ఏమన్నాడంటే..

  శంకర్ ఏమన్నాడంటే..

  ఏకంగా ‘రోబో' కంటే పదింతలు ఎక్కువగా కష్టపడ్డానని, అందుకు తగ్గట్టుగానే ‘2.0' ఉండబోతోందని ప్రకటించారు శంకర్‌. ‘రోబో'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రమే ‘2.0'. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

  దీపావళికే...ఖరారు

  దీపావళికే...ఖరారు

  త్రీడీలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆదివారం ముంబయిలో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కరణ్‌జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరించారు.

  కండలవీరుడు ఎంట్రీతో ...కిక్

  కండలవీరుడు ఎంట్రీతో ...కిక్

  సల్మాన్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాక అందరికీ సర్పైజింగ్ గా మారింది. మీడియాలో కూడా ఈ విషయమై ఎక్కడా న్యూస్ రాకుండా జాగ్రత్తపడ్డారు. దాంతో బాలీవుడ్ మీడియా ఈ సర్పైజ్ ని బాగా హైలెట్ చేసింది. మరి బాలీవుడ్ కి సల్మాన్ సూపర్ స్టార్ కదా.

  సల్మాన్ ఏమన్నారంటే..

  సల్మాన్ ఏమన్నారంటే..

  వేడుకలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ తళుక్కున మెరిశారు. ఆయన్ని ఎవరూ ఆహ్వానించకపోయినా ‘2.0' వేడుకలో ప్రత్యక్షమయ్యారు. ‘‘రజనీకాంత్‌ అంటే నాకెంతో గౌరవం. ఆయన్ని కలుసుకొనేందుకే నాకు ఆహ్వానం లేకపోయినా ఈ వేడుకకి వచ్చా'' అన్నారు.

  కరుణ్ జోహార్ ని గిల్లాడే

  కరుణ్ జోహార్ ని గిల్లాడే

  వేదికపైనున్న కరణ్‌జోహార్‌ని ఉద్దేశించి సల్మాన్ ఖాన్ చిన్న జోక్ లాంటి చమత్కారం విసిరారు. సల్మాన్ మాట్లాడుతూ.. ‘మీరు శంకర్‌లాగా సినిమాలెందుకు తీయరు?' అని చమత్కరించారు. ఇలా అనగానే ఆడిటోరియం మొత్తం ఘొల్లుమంది. మీడియా కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేసింది. కరుణ్ జోహార్ సరదాగా నవ్వేసారు.

  నేను హీరోని కాదు..

  నేను హీరోని కాదు..

  వేడుకనుద్దేశించి రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా త్రీడీలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచబోతోంది. అయితే ఇందులో హీరోని నేను కాదు, అక్షయ్‌కుమారే. నాకు ఎంపిక చేసుకొనే అవకాశమొచ్చుంటే నేను అక్షయ్‌కుమార్‌ పాత్రనే ఎంచుకొనేవాణ్ని అని చెప్పుకొచ్చారు.

  పనిచేయటం కష్టం

  పనిచేయటం కష్టం

  రజనీకాంత్ కంటిన్యూ చేస్తూ... దర్శకుడు శంకర్‌తో పనిచేయడం చాలా కష్టం. ఆయనొక పర్‌ఫెక్షనిస్ట్‌. భారతీయ సినిమాని హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లే చిత్రమిది. త్రీడీలో నన్ను నేను చూసుకోవడం కొత్తగా అనిపించింది''అన్నారు.

  ఎవరెస్ట్ మోస్తున్నా...

  ఎవరెస్ట్ మోస్తున్నా...

  ‘‘రోబో'కి కొనసాగింపుగా 2.0తో పాటు, మరొక చిత్రం కూడా ఉండబోతోంది.ఈ సినిమా ప్రయాణం భుజాలపై ఒక ఎవరెస్ట్‌ని పెట్టుకొని ఎవరెస్ట్‌ని ఎక్కుతున్నట్టుగా అనిపిస్తోంది''అన్నారు దర్శకుడు శంకర్‌.

  యస్ అంటే..సల్మాన్ తో ..రెడీ

  యస్ అంటే..సల్మాన్ తో ..రెడీ

  ఈ సినిమాలో హీరో నేను కాదు.. అతనే. రేపు దేశమంతా అక్షయ్ నటనను ప్రశంసిస్తుంది. నిజం చెప్పాలంటే.. శంకర్‌తో పనిచేయడం కష్టమండీ (నవ్వులు). పర్‌ఫెక్షన్ కోసం పరితపిస్తాడు. సల్మాన్‌ఖాన్ 'యస్' అంటే అతనితో కలసి సినిమా చేయడానికి నేను రెడీ అన్నారు రజనీకాంత్.

  అక్షయ్ మాత్రమే...

  అక్షయ్ మాత్రమే...

  ''సూపర్‌స్టార్ (రజనీకాంత్) గురించి ఏం చెప్పను! నన్నెవరూ పిలవకపోయినా ఆయన్ను చూడ్డానికే ఈ వేడుకకి వచ్చా. అక్షయ్ మాత్రమే క్రౌమ్యాన్ పాత్ర చేయగలడు. నటుడిగా విభిన్న పాత్రలు చేస్తూ పైకి ఎదుగుతున్న హిందీ నటుడు అక్షయ్ ఒక్కడే'' అని సల్మాన్ ఖాన్ అన్నారు.

  ఖచ్చితంగా చేస్తా

  ఖచ్చితంగా చేస్తా

  'రోబో'కి సీక్వెల్‌గా రూపొందిన ఈ '2.0'కి, మొదటి భాగం కంటే పదిరెట్లు ఎక్కువ కష్టపడ్డానని చెప్పిన శంకర్, 'రోబో-3' తీస్తున్నట్టు స్పష్టం చేశారు. దాంతో రోబో అభిమానుల్లో ఆనందం కలిగింది. సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

  హిస్టరీ క్రియేట్ చేస్తుంది..

  హిస్టరీ క్రియేట్ చేస్తుంది..

  ''ఈ కథను నమ్మా. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది'' అని అక్షయ్‌కుమార్ అన్నారు. అలాగే ఆయన గెటప్ గురించి చాలా కష్టపడ్డానని అన్నారు. ఇప్పటికే విడుదలైన అక్షయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అంతటా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గురించే బాలీవుడ్ లో చర్చలు జరిపేలా చేస్తోంది.

  ఎప్పుడు ఇంతలా చెయ్యలేదు

  ఎప్పుడు ఇంతలా చెయ్యలేదు

  అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ... ‘‘నా జీవితంలో ఎప్పుడూ మేకప్‌ వేసుకోలేదు. కానీ ఈ సినిమా కోసం రోజూ 3 గంటలపాటు మేకప్‌ వేసుకొని నటించాల్సి వచ్చింది. రజనీకాంత్‌గారితో కలిసి నటించడం చక్కటి అనుభవం.భారతీయ చిత్ర పరిశ్రమలో ‘2.0' ఓ చరిత్రని సృష్టించబోతోంది'' అన్నారు.

  చాలా శ్రమిస్తున్నాం

  చాలా శ్రమిస్తున్నాం

  సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు శంకర్‌ ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. 2.0 కోసం చాలా శ్రమిస్తున్నాము''అన్నారు. రెహమాన్, శంకర్ ల కాంబినేషన్ లో ఇంతకు ముందు చాలా హిట్స్ వచ్చాయి. అన్నీసూపర్ హిట్స్ అయ్యీయి. దాంతో ఈ సినిమా ఆడియో కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.

  త్రీడి కళ్లజోడు పెట్టుకునే చేసా

  త్రీడి కళ్లజోడు పెట్టుకునే చేసా

  ఈ చిత్ర ఎడిటర్‌ ఆంటోనీ మాట్లాడుతూ... ‘‘రోబో కంటే పది రెట్లు ఛాలెంజింగ్‌గా భావించి ‘2.0' చేస్తున్నాం. త్రీడీ కళ్లజోడు ధరించే సినిమాని ఎడిటింగ్‌ చేశా'' అన్నారు. త్రిడీ చిత్రం కావటంతో సినిమాకు పని చాలా పెరిగింది.

  తొలిసారిగా వరల్డ్ సినీ హిస్టరీలోనే..

  తొలిసారిగా వరల్డ్ సినీ హిస్టరీలోనే..

  ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి ‘2.0' ఓ కొత్త రకమైన శబ్దంతో విడుదల కాబోతోందని సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పుకుట్టి తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రాలకు సౌండ్ పై ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా ఉండాలి.

  గొప్ప ఎక్సపీరియన్స్ ఇస్తుంది

  గొప్ప ఎక్సపీరియన్స్ ఇస్తుంది

  ‘‘భారతీయ సినిమా చరిత్రలోనే ఓ గొప్ప అనుభూతిని పంచే చిత్రంగా ఇది నిలిచిపోతుంది'' అన్నారు వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులు శ్రీనివాస్‌. ఈ సినిమా తన కెరీర్ కు బాగా ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే సినిమాలో ఎక్కువ బాగం గ్రాఫిక్స్ కు ప్రయారిటి ఉంటుంది.

  దటీజ్ రజనీ...

  దటీజ్ రజనీ...

  స్క్రీన్ పై రజనీ ఎలా ఉంటుంది, ఎంత పవర్ ఫుల్ గా ఆయన వాయిస్ ని డిఫెరెంట్ లాంగ్వేజ్ లలో డబ్ చేస్తారు అనే విషయం కన్నా రియల్ గా తెరపై ఆయన వాయిస్ ని వినటం అనేది గొప్ప అనుభూతి. మనకు రోబో మొదటి భాగం ఆడియో పంక్షన్ ని గుర్తు చేసుకుంటే అప్పుడు ఆయన బిగ్ బి ని ప్రసంశిస్తూ స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ దే సినిమా అన్నారు.అదీ ఆయన గొప్పతనం. మైక్ దొరికింది కదా అని గొప్పలు చెప్పుకోలేదు.

  సౌత్ నుంచే కాదు...

  సౌత్ నుంచే కాదు...

  ఇప్పుడు ఈ సినిమా అక్షయ్ కుమార్ రాకతో, ముంబైలో ఫస్ట్ లుక్ ఫంక్షన్ జరపటంతో కేవలం సౌత్ కే పరిమితమైన సినిమా అనే ముద్రపోయింది. హిందీ మార్కెట్ కు అక్షయ్ కుమార్ ఛరిష్మా బాగా ఉపయోగపడుతుందని చెప్పటంలో సందేహించాల్సిన అవసరం లేదు.

  పంక్షన్ కు ముందే..

  పంక్షన్ కు ముందే..

  ఇక ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఫంక్షన్స్ ని ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ "యష్ రాజ్" సూడియోలో భారీ స్థాయిలో నిర్వహించారు, దాని కోసం ప్రముఖులను ఇన్వేట్ చేయటానికి రూపొందించిన కార్డు సైతం చర్చనీయాంశమైంది.

  ఇదొక్కటి చూసి

  ఇదొక్కటి చూసి

  ఈ ఫస్ట్ లుక్ ఫంక్షన్ చూస్తూంటేనే అర్దమైపోతోంది.. ఈ సినిమా ఎంత భారీగా రూపొందుతోందో. ఫస్ట్ లుక్ పంక్షన్ ఈ రేంజిలో ఉందంటే..ఇక తర్వాత చేయబోయే ఆడియో పంక్షన్ ఏ స్దాయిలో ఉండబోతోందో అని అందరూ అంచనా వేస్తున్నారు. మీడియా మొత్తం ఇదే విషయం మాట్లాడుతోంది

  నిజంగానే అంత ఖర్చు

  నిజంగానే అంత ఖర్చు

  ఈ సినిమాని 360 కోట్ల భారీ ఖరుతో నిర్మించారంటూవార్తలు వస్తున్నాయి, అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపుగా 40 కోట్లు వరకూ ఖర్చు చేయనున్నానని నిర్మాత ప్రకటించారు. 40 కోట్లు అంటే తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా బడ్జెట్ అంత అన్నమాట. ఈ ప్రమోషన్ బడ్జెట్ విని అంతా షాక్ అవుతున్నారు.

  ఆయన అదరకొట్టాడు

  ఆయన అదరకొట్టాడు

  కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కు వ్యాఖ్యాతగా ఉండటం హైలెట్ గా నిలిచింది. ఆయన తన సరదా జోక్స్ తో , కబుర్లుతో ఆద్యంతం ఈ ఈవెంట్ ని ఆసక్తికరంగా నడిపారు. ఆయన కాఫి విత్ కరణ్ ఎంత సక్సెస్ అయ్యిందో అదే తరహాలో ఈ ఈవెంట్ ని కూడా సక్సెస్ చేసారు.

  అనుకోలేదు

  అనుకోలేదు

  ఇంతమంది లెజండ్స్ తో పనిచేస్తానని నేను ఊహించలేదు. సెట్స్ పై అంతా ఫ్యామిలీలాగ ఉన్నారు. షూటింగ్ చాలా సరదాగా గడిచిపోయింది. శంకర్ సార్ ప్రతీవిషయం విడమర్చి చెప్పేవారు అని అమి జాక్సన్ మాట్లాడారు.

  విజువల్ ఎఫెక్ట్స్ ...

  విజువల్ ఎఫెక్ట్స్ ...

  ఇక ఈ సినిమాకు పనిచేస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ బాహుబలికి పని చేసినవారే. దాంతో ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై మంచి అంచనాలు ఉన్నాయి. అంతుకు ముందు రోబో పార్ట్ వన్ కు కూడా ఈ టీమే పనిచేసింది. అప్పుడు కూడా విజువల్ ఎఫెక్ట్స్ అద్బుతంగా ఉన్నాయని పేరు వచ్చింది.

  శంకర్ ఇష్టపడరు...

  శంకర్ ఇష్టపడరు...

  పాటల రచయిత మదన్ కార్కే..శంకర్ డైరక్షన్ స్టైల్ ని బాగా మెచ్చుకున్నారు. శంకర్ ఎప్పుడూ పాత గా ఉండాలని, క్లిచెస్ ఇష్టపడరు. ఎప్పుడు కొత్తదనం కోరుతారు. అందుకే ఆయన అంతలా సక్సెస్ అ్యయారు. రహమాన్ గారు నేను రాసిన పాట పాడారు. అదో పెద్ద గౌరవం నాకు అన్నారు.

  ఈసారి హిస్టరీ..

  ఈసారి హిస్టరీ..

  ఈ చిత్రం డైలాగు రైటర్ జయా మోహన్ మాట్లాడుతూ...మేము సాధారణంగా సినిమా తయారు చేస్తాం. కానీ ఈ సారి హిస్టరీని తయారు చేస్తున్నామంటూ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లో సినిమా ఘన విజయంసాధిస్తుందనే కాన్పిడెంట్ కనపడింది.

  నిర్మాతల దృష్టి అంతా..

  నిర్మాతల దృష్టి అంతా..

  ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేయాలని ఇప్పిటికే దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయ్యారనే సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కోసం దర్శకుడు శంకర్ యీనిట్ దగ్గర పక్క ప్లాన్ సిద్ధంగా వందని సమాచారం, ఈ సినిమాని నిర్మిస్తున్న లైకా సంస్థ వారు ఇప్పటికే ఆ ప్లాన్స్ ని అప్రూవ్ చేసారు.

  ఓ రేంజిలో ఉన్నాయి

  ఓ రేంజిలో ఉన్నాయి

  2.0 చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ నిర్మాత ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోగానే అంతటా అద్బతమైన స్పందన వచ్చింది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌ విలన్ పాత్రలో పోషిస్తున్నారు.ఈ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  మైలురాయి అవుతుంది

  మైలురాయి అవుతుంది

  అమీ జాక్సన్ మాట్లాడుతూ.. ' దాదాపు 60 రోజులు నేను రజనీకాంత్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాను. చాలా థ్రిల్లింగ్‌, స్పెషల్‌గా ఫీలయ్యాను. మిగిలిన పాటను వచ్చే ఏడాది షూట్‌ చేస్తాం. 'రోబో 2' నా సినీ కెరీర్‌లో కచ్చితంగా ఓ మైలురాయి అవుతుంది. మళ్లీ దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేయడం ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సినిమా విడుదల కోసం ఆతృతగా ఉన్నా' అన్నారు.

  మళ్లీ..మళ్లీ

  మళ్లీ..మళ్లీ

  ఈ చిత్రంలో హీరో రజనీకాంత్...గతంలో శంకర్ తో సినిమాలు చేసిన సూపర్ స్టార్. ఇక శంకర్‌ దర్శకత్వం వహించిన 'ఐ' చిత్రంలో అమీజాక్సన్‌ హీరోయిన్ గా నటించారు. దాంతో '2.0' కు వీరిని ఎంపిక చేయటంతో ఆయనకు సగం పని ఈజి అయ్యిందిట. శంకర్ ఎలా చెప్తాడో, ఏం సీన్స్ డీల్ తెలుసు కాబట్టి హ్యాపీగా ఉన్నారట.

  వీళ్లంతా ఫంక్షన్ కు ..

  వీళ్లంతా ఫంక్షన్ కు ..

  ముంబైలోని యశ్‌రాజ్ ఫిలింస్ స్టూడియోలో జరిగిన ఫస్ట్‌లుక్ లాంఛింగ్ కార్యక్రమానికి రజినీ, అక్షయ్‌, శంకర్, ఏఆర్ రెహమాన్ తోపాటు లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాష్ కరణ్, ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్, స్కిప్ట్ రచయిత జయమోహన్, కోలీవుడ్ నటులు ఆర్య, విజయ్ ఆంటోని తదితరులు హాజరయ్యారు.

  మోహన్ లాల్ సైతం...

  మోహన్ లాల్ సైతం...

  సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 2.0. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుండగా, ఇప్పటి నుంచే ఈ చిత్ర రైట్స్ కోసం పలు ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ పోటి పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2.0 చిత్రం కేరళ రైట్స్ ని మోహన్ లాల్ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

  బాలీవుడ్ కోసమే..

  బాలీవుడ్ కోసమే..

  నిజానికి సూపర్ స్టార్ హీరో అయినప్పుడు అతని ఫోటోతోనే పోస్టర్స్ వస్తాయి. కానీ రోబో 2 కు మాత్రం మొదట విలన్ ఫొటో ని విడుదల చేసి ఆ తర్వాత హీరో ఫస్ట్ లుక్ వచ్చింది. అలాగే సాధారణంగా సినిమా పోస్టర్లపై విలన్ల పేర్లను ప్రస్తావించరు. కానీ ఈ పోస్టర్లో రజనీతో పాటు అక్షయ్‌కుమార్‌ పేరు కూడా ప్రస్తావించడం గమనార్హం. అంటే విలన్ పాత్రకు సినిమాలో ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ కావటం అక్షయ్ కుమార్..కలిసివచ్చే అంశం అంటున్నారు

  అందుకే ఇక్కడ కాకుండా

  అందుకే ఇక్కడ కాకుండా

  వాస్తవానికి ఫస్ట్ లుక్ కార్యక్రమాన్ని చెన్నైలో ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ముంబైలో పెట్టారు. ముంబైలో ఫస్ట్ లుక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనక ముఖ్య కారణం సినిమాకు నేషనల్ వైడ్ హైప్ తేవడమే అనేది నిజం. బాలీవుడ్ నటులు రావటంతో నేషనల్ మీడియా మొత్తం ఈ సినిమాపై ఫోకస్ చేసింది. ఎప్పటిలాగ చెన్నైలో చేస్తే అది సౌత్ సినిమా కింద ముద్ర పడుతుందని, ముంబైలో చేస్తే నేషనల్ వైడ్ హైప్ వస్తుందని భావిస్తున్నారు.

  బాహుబలిలాగానే...

  బాహుబలిలాగానే...

  ప్రభాస్ ‘బాహుబలి'లాగానే ‘రోబో 2.0'ను కూడా బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్ తీసుకుని రిలీజ్ చేయబోతున్నాడట. అందుకే ఇలా ఫస్ట్ లుక్ పంక్షన్ కు వచ్చి మరీ ప్రమోట్‌ చేస్తున్నాడంటున్నారు. అయితే ‘బాహుబలి-2'తో పోలిస్తే ‘రోబో 2.0'కు ఉండే పెద్ద అడ్వాంటేజ్‌ అక్షయ్‌ కుమార్‌. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ ‘రోబో 2.0'లో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రమోషన్‌ పరంగా ఈ సినిమాకు అక్షయ్‌ చాలా హెల్ప్‌ అవుతాడు.

  దీపావళి గిప్ట్

  దీపావళి గిప్ట్

  అంతా బాగానే ఉంది . సినిమా రిలీజ్ ఎప్పుడూ అంటారా... ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావొస్తున్న ఈ చిత్ర్రం పోస్ట్ ప్రొక్షన్ పనుల కోసం మరో 6నెలల సమయం తీసుకోనున్నాడట శంకర్. ఈ చిత్రాన్ని వచ్చే యేదాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీల కాంబినేషన్లో వచ్చిన ‘రోబో' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సెన్సేషన్ ను రిపీట్ చేయడానికి శంకర్, రజనీలు ‘రోబో 2.0' అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు.

  English summary
  Superstar Rajinikanth and director Shankar’s magnum opus #2.0 '2 Point O', sequel to ‘Robo’, will be releasing on Diwali festival in 2017. The movie will be releasing in 3D. The official release date was announced yesterday (November 20) in Mumbai.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more