నయనతారా, ప్రభుదేవా మద్య రాజీ కుదుర్చనున్న రోబో
తమిళ సినీపరిశ్రమలో ఎవరు సమస్యల్లో చిక్కుకున్నా వారి జీవితాలను చక్కబెట్టడంలో రజినీకాంత్ ముందుంటారని పేరు. అంతెందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎందరో నాటితరం తారలకు అదృశ్యంగా ఆయన ఆర్థిక సహాయం చేస్తుంటారని సమాచారం. అటువంటి రజినీకాంత్ ఇటీవల ప్రభుదేవా భార్య తన భర్తను అప్పగించమని కోర్టుకెక్కడాన్ని చూసి చలించిపోయారట. ప్రభుదేవాను విడిచి వెళ్లిపోవాలని నయనతారకు సలహా ఇచ్చారట. అలా చేయడం ద్వారా ఓ కుటుంబాన్ని ఆదుకోవడమే కాక, నీ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు లేకుండా సాగిపోతుందని నయనకు నచ్చచెప్పారట.
గతంలో కూడా నయనతార శింబు ప్రేమలో పీకల్లోతు కూరుకుపోయి ఆనక శింబు నిరాదరణకు గురైనప్పుడు ఆమెకు రజినీ ధైర్యం చెప్పి కెరీర్ పై దృష్టి పెట్టమని చెప్పాడట. ఇపుడు కూడా అందరి క్షేమం కోరి చెపుతున్నానని అన్నారట. ఇదిలావుంటే నయనతార, ప్రభుదేవాలు పెళ్లికోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం తెలుసుకున్న ప్రభుదేవా భార్య, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండా చూడండంటూ కోర్టులో మొరపెట్టుకుంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి..


Click it and Unblock the Notifications











