»   » 'బ్లాక్ డే' అంటూ ట్విట్టర్ లో బాధపడ్డ రజనీకాంత్

'బ్లాక్ డే' అంటూ ట్విట్టర్ లో బాధపడ్డ రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :నిన్నటి రోజు(సోమవారం)ని రజనకాంత్ డార్క్ డే గా అభివర్ణించారు. ఆయన ట్విట్టర్ లో రాస్తూ బ్లాక్ డే అన్నారు. ఇలా ఇంతలా రజనీ అప్ సెట్ అయ్యి..ఇలా మాట్లాడటానికి కారణం మరేదో కాదు ఆయనకు అత్యంత ఇష్టమైన నాయుకుడు లీ కువాన్ (సింగపూర్ మాజీ ప్రధాని) మరణం. ఈ విషయమై ఆయన చాలా కాలం త్వర్వాత ట్విట్టర్ కు వచ్చి... "నేను ఆరాధించే లీడర్ ..మృతి చెందిన ఈ రోజు డార్క్ డే.. నాకు చాలా బాధగా ఉంది. ఓ నిజమైన,పాత్ బ్రేకింగ్ పొలిటీషియన్ గా ఆయన లేని లోటు తీర్చలేనిది...ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను " అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

లీ కువాన్ గురించి...

సింగపూర్‌ జాతిపిత, ఆధునిక సింగపూర్‌ నిర్మాత, ఆదేశ మాజీ ప్రధాని లీ కువాన్‌ యూ కన్నుమూశారు. 91 ఏళ్ల లీ గత కొద్ది కాలంగా తీవ్ర ఆనారోగ్యం బాదపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతిచెందారు. లీ మృతితో సింగపూర్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. దేశ ప్రజలు తమ ప్రియతమ నేతకు నివాళులర్పిస్తున్నారు. ఈ నెల 29న అత్యున్నత అధికార లాంఛనాలతో లీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. లీ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

చిన్న నగర రాజ్యాన్ని ప్రపంచలోనే పెద్ద ఆర్థిక శక్తిగా, అసమాన శక్తిగా మార్చిన లీ కువాన్‌ యూ.. 1959లో బ్రిటీష్‌ పాలన నుంచి సింగపూర్‌ విముక్తి పొందిన నాటి నుంచి 1990 వరకు ఆదేశ ప్రధానిగా కొనసాగుతూ వచ్చారు. 1965లో మలేషియా నుంచి విడిపోయిన సింగపూర్‌ ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది.

Rajinikanth calls it a Dark Day?

1990లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లీ అప్పటి వరకూ దేశాన్ని అత్యంత ఉన్నత దశకు చేర్చారు. సహజ వనరులే లేని సింగపూర్‌ను భారీ పరిశ్రమల కేంద్రంగా, ఆసియా వ్యాపార బిందువుగా మార్చేందుకు అహర్నిశలు కృషిచేశారు. శ్రమశక్తులను సమర్థవంతంగా వినియోగించుకున్న లీ ఆధునిక సింగపూర్‌ నిర్మాతగా పేరుపొందారు.

విదేశీ పెట్టబడులను ఆహ్వానించడంతో పాటు, పరిశ్రమల స్థాపనకు అనువైన ఏర్పాటును కల్పించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనవసర జాప్యం లేకుండా చూసుకున్నారు. ఆంగ్ల విద్య తెలిసిన వారిని ఉద్యోగాల్లో చేర్చుకుని పనులను వేగవంతం చేశారు.

అయితే లీ పై తన ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచి వేశారన్న అపవాదు ఉన్నప్పటికీ.. దేశాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టించడంతో దానిపై ఎవరూ పెద్దగా దృష్టిపెట్టలేదు. 31 ఏళ్ల పాలన తర్వాత లీ అధికారం నుంచి వైదొలిగారు. ఆయన కుమారుడు లీ సూన్‌ లింగ్‌ ప్రస్తుతం సింగపూర్‌ ప్రధానిగా ఉన్నారు.

English summary
Rajini took to his Twitter page to mourn the death of his Favourite Politician - "Indeed a dark day as a leader I admired has passed on. I feel your sorrow S'pore. A true loss of a path breaking politician. #RIPLeeKuanYew".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu