»   » పదవులకు రాజీనామా చేయాలి: రజనీ కాంత్ కీలక వ్యాఖ్య

పదవులకు రాజీనామా చేయాలి: రజనీ కాంత్ కీలక వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : చలన చిత్రపరిశ్రమంతా ఓ కుటుంబమని సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. ఆదివారం ఉదయం చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు చెన్నైలో అళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రజనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పదవులకు రాజీనామాలు చేయాలన్నారు. ఆదివారం ఉదయం ఓటు వేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమంతా ఓ కుటుంబమన్నారు. ఎన్నికలు, అందుకు సంబంధించిన ఆరోపణలు తాత్కాలికమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు చిత్ర ప్రముఖులు క్యూ కట్టడంతో తమ అభిమాన నటీ నటులను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే చలన చిత్రరంగానికి చెందిన ప్రముఖలంతా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. శరత్ కుమార్, విజయ్, రాధా, రజనీ తదితరులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Rajinikanth cast votes in SIAA polls

గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్ కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది. దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైనాయి. అంతేకాకుండా అటు శరత్ కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ... చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొంది. దాంతో ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి.

మరో ప్రక్క

హీరో విశాల్ పై ప్రముఖ నటుడు శరత్ కుమార్ వర్గీయులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే సన్నిహితులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై దాడికి పాల్పడుతున్నారని విశాల్ ఆరోపించారు.

Rajinikanth cast votes in SIAA polls

నడిగర్ సంఘం ఎన్నికలు ఆదివారం ఆళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్ కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది.

దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైంది. అంతేకాకుండా అటు శరత్ కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం ప్రకటించనున్నారు.

Rajinikanth cast votes in SIAA polls

ఓ విధంగా చెప్పాంటే సీనియర్ నటులు... జూనియర్ నటుల మధ్య పోటీగా మారిందని చెప్పవచ్చు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు మాత్రం శరత్ కుమార జట్టుకే ఉందని సమాచారం. కానీ ఈ ఎన్నికల్లో విజయావకాశాలు మాత్రం విశాల్ జట్టుకు వరించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పద్మనాభన్ ప్రకటించనున్నారు.

ఈ ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ నడిగర్ సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా లేక సాధారణ పోటీ మధ్య ఎంపికయిన జట్టు పదవీ బాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే.

English summary
Rajinikanth, who cast his vote at a private school where the elections are being held, said although the election was bitterly contested by two groups headed by incumbent R Sarath Kumar on one side and young hero Vishal Reddy on the other, the film fraternity was always a ‘family.’ He expressed his greetings to whoever wins the race but insisted that the winner should go the extra mile to fulfill the promises made. “If not, they should voluntarily resign and this would give them a great respect (among their colleagues),” he said.
Please Wait while comments are loading...