»   » రజనీకాంత్ మరో సాహసం......!??

రజనీకాంత్ మరో సాహసం......!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'మురత్తు కాలై" గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా అందులో ఓ ట్రైన్ ఎపిసోడ్ గురించి మాట్లాడాలి. రజనీ కెరీర్ లో బెస్ట్ ట్రైన్ ఎపిసోడ్ ఈ చిత్రంలో ఉంది. దీన్ని మించిన స్థాయిలో ట్రైన్ ఎపిసోడ్ ను కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ సారధ్యంలో 'రోబో" సినిమా కోసం తెరకెక్కించారు దర్శకుడు శంకర్. ఈ షూటింగ్ ని ముంబాయికి దగ్గరలోని లొనోవల ప్రదేశంలో షూట్ చేసినట్టు సమాచారం.

కదిలే ట్రైన్ పై ఫైట్ సన్నివేశాలను ఇటీవలే చిత్రీకరించారు. ఈ వివరాల ప్రకారం రజనీకాంత్ చాలా పవర్ ఫుల్ యాక్షన్ చేసినట్టు సమాచారం. ఈ సీన్ రోబో చిత్రంలో హైలైట్ అవుతుందని దర్శకుడు తెలియజేశారు. దీనికొరకు సెంట్రల్ రైల్వేలకు ఎక్కువ మొత్తంలో చెల్లించి ఓ ట్రైన్ ను అద్దెకు తీసుకున్నారు. ఊటిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించగా కదిలే ట్రైన్ పై డూప్ లేకుండా రజనీ సాహసాలు చేశారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu