సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె వివాహానికి అతిరథ మహారథులు హాజరు...!?
సూపర్ స్టార్ రజనీకాంత్ జ్వేష్ట కుమార్తె ఐశ్వర్యకు గతకొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమె చలన చిత్ర నటుడు ధనుష్ ను వివాహమాడారు. కాగా రాజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్యకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టాఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన అశ్విన్ తో నిశ్చితార్థం జరిగిన సంగతి విదితమే. దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం అంగరంగ వైభవంగా శుక్రవారం చెన్నైలోని రాణి మెయమ్మాయ్ హాలులో తమిళ అయ్యంగర్ పద్ధతిలో చెన్నైకు చెందిన అశ్విన్‌తో సౌందర్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు రాజకీయ ప్రముఖులతోపాటు భారతీయ సినీ పరిశ్రమకు చెంది మేటి నటీనటులు హాజరయ్యారు.
కేంద్ర హోం మంత్రి చిదంబరంతోపాటు బాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, శ్రీదేవి, బోనీ కపూర్, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్..ఇంకా ఇతర తారలు హాజరయ్యారు.
రజనీకాంత్ సౌందర్య అశ్విన్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ శ్రీదేవి బోనీ కపూర్ చిరంజీవి కమల్ హాసన్ rajinikanth soundarya aswin abhishek bachchan aishwarya rai sri devi boni kapoor


Click it and Unblock the Notifications