»   » హాస్పటిల్ నుంచి రజనీ డిశ్చార్జ్, రెండు వారాల రెస్ట్

హాస్పటిల్ నుంచి రజనీ డిశ్చార్జ్, రెండు వారాల రెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న (ఫిబ్రవరి 22)న చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్దోపడెక్స్ హాస్పటిల్ లో ఉన్నారు. రోబో 2 షూటింగ్ లో పాల్గొంటున్న ఈయన రొటిన్ చెకప్ కోసమే ఇక్కడకి వెళ్లి గడిపి టెస్ట్ లు చేయించుకున్నారని చెప్తున్నారు.

ఈ రోజున అంటే మంగళవారం రజనీ హాస్పటిల్ నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఓ రోజంతా డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉండటం జరిగింది. కబాలి, రోబో 2 షూటింగ కోసం మలేషియా మరియు అనేక ప్రదేశాలు ప్రీక్వెంట్ గా తిరుగుతున్న రజనీ కి డాక్టర్లు కొన్ని వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం.

ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డి రవిచంద్రన్ ఆయనకు పరీక్షలు నిర్వహించి రెస్ట్ తీసుకోమని ,కొద్ది రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వమని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఆయన ఈ షూటింగ్ నిమిత్తం తిరిగే ప్రయాణాలలో బాగా అలిసి పోయి ఉన్నారని , తిరిగి ఎనర్జీ వచ్చి రికవరీ అయిన తర్వాత షూటింగ్ లకు హాజరుకమ్మని చెప్పినట్లు వినిపిస్తోంది.

Rajinikanth Discharged From MIOT Hospital, Doctors Advise Him To Take A Break From Shooting

కానీ మార్చి రెండో వారంలో ఆయన శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న రోబో 2 షూటింగ్ కు హాజరుకావాల్సి ఉంది. అక్కడ ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొనాలి. అక్షయ్ కుమార్ తో ఈ ఫైట్ సీన్ ప్లాన్ చేసారు.

మరో ప్రక్క కబాలికి డబ్బింగ్ ఫినిష్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు పి.ఎ రంజిత్. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల అవుతుంది.

English summary
Superstar Rajinikanth was reportedly hospitalized for a day (February 22) at Madras Institute of Orthopaedics and Traumatology (MIOT), Chennai. Reported as a 'routine health check-up', the Enthiran actor was seen leaving the hospital later in the day after being admitted early in the morning.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu