For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అగ్దదీ సూపర్ స్టార్ అంటే......ఒప్పుకోవాల్సిందే

  By Srikanya
  |

  చెన్నై : స్టార్స్, సూపర్ స్టార్స్ ఓవర్ నైట్ లో అయిపోరు. వారు చేసే పాత్రలు,వారి ప్రవర్తన, వారి ఇమేజ్, అన్నిటికీ మించి పనిలో వారు చూపించే శ్రద్ద వారిని సూపర్ స్టార్స్ గా మారుస్తాయి. రజనీకాంత్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అవటానికి ఉన్న కారణాలలో ఆయనకు తన వృత్తి మీద ఉన్న అత్యంత శ్రద్ద ఒకటి అని చెప్తారు. అదే రీసెంట్ గా మరోసారి లింగా డబ్బింగ్ విషయంలో ప్రూవ్ అయ్యింది.

  తాజాగా రజనీ నటిస్తున్న 'లింగా'సినిమానే ఇందుకు ఉదాహరణ. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. డిసెంబరు 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నారు. అందుకే షూటింగ్‌ చకచకా సాగిపోతోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు వేగం పుంజుకొన్నాయి. డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించినంత వరకూ రజనీ తన డబ్బింగ్‌ పూర్తి చేసుకొన్నారు. అదీ 24 గంటల్లోనే.

  ''సాధారణంగా డబ్బింగ్‌ కోసం మూడు, నాలుగు రోజుల సమయం పడుతుంది. రజనీ మాత్రం ఒక్క రోజులో పూర్తి చేశారు. ఎంత పెద్ద సన్నివేశమైనా రెండు టేకులకు మించి తీసుకోలేదు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకొన్నారంతే'' అని చిత్రబృందం చెబుతోంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. అనుష్క, సోనాక్షిసిన్హా హీరోయిన్స్ గా నటించారు.

  Rajinikanth dubbed for 'Lingaa' in 24 hours?

  కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమీ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

  ఇక ఈ సినిమా కథ గురించి ఇటీవల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య కట్టిన ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ నేపథ్యంలో తీర్చిదిద్దన కథతో తెరకెక్కుతోందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. పెరియార్‌ డ్యామ్‌పై వివాదం నడుస్తోంది. మరి ఈ సినిమాతో రజనీ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

  అంతేకాకుండా రజనీకాంత్ స్వయంగా ఈ చిత్రం విడుదల తేది ప్రకటించి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. 'లింగా' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రజినికాంత్. ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాదని చెప్పారు. బెంగుళూరు లో అక్కడ మీడియాతో మాట్లాడిన రజినీకాంత్.. తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ‘లింగా' విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు.

  చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

  English summary
  Superstar Rajinikanth has dubbed for his upcoming Tamil film "Lingaa" at a lightning speed. He is said to have finished dubbing for it in less than 24 hours, much to the surprise of the film's crew.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X