»   » కొచ్చాడయాన్ తెలుగు వెర్షన్‌కి రజనీకాంత్ డబ్బింగ్

కొచ్చాడయాన్ తెలుగు వెర్షన్‌కి రజనీకాంత్ డబ్బింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం తమిళనాడులోనే పాపులర్ కాదు...ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ ఇదివరకు నటించని 'రోబో' చిత్రం తెలుగులో విడుదలై సూపర్ హిట్ అవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. తాజాగా రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' తెలుగులో 'విక్రమ సింహ' పేరుతో విడుదలవుతోంది.

'విక్రమ సింహ' చిత్రం రాజుల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెఎస్ రవి కుమార్ ఈచిత్రానికి స్క్రిప్టు అందించారు. పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

జనవరి 19, 2012లో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ నవంబర్, 2012లో పూర్తయింది. అయితే గ్రాఫిక్స్‌తో కూడిన ప్రొస్టు ప్రొడక్షన్ పనులు హెవీగా ఉండటంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికీ పోస్టు ప్రొడక్షన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మళయలం, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

విక్రమ సింహలో నటీనటులు

విక్రమ సింహలో నటీనటులు

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనె రజనీకాంత్ ప్రియురాలి పాత్రలో నటిస్తోంది. ఆమెతో పాటు ప్రముఖ నటులు శరత్ కుమార్, ఆది, శోభన, జాకీ ష్రాఫ్, నాసర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం

ఏఆర్ రెహమాన్ సంగీతం

విక్రమ సింహా చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఏరో 3డి సౌండ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వనుంది.

రాజీవ్ మీనన్ పిక్చరైనేషన్

రాజీవ్ మీనన్ పిక్చరైనేషన్

ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ పని చేస్తున్నారు. విక్రమ సింహ చిత్రాన్ని మోషన్ పిక్చర్ టెక్నాలజీతో 3డిలో తెరకెక్కించారు. ఒక్కోసీన్ చిత్రీకరించడానికి ఏక సమయంలో 48 కెమెరాలను ఉపయోగించారట.

విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్...

విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్...

ఈ చిత్రంలోని విఎఫ్ఎక్స్ వర్క్......ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. అవతార్ చిత్రానికి పని చేసిన స్టీరియోగ్రాఫిక్ టీం ‘కొచ్చాడయాన్' చిత్రానికి పని చేసారు.

విక్రమ సింహ రిలీజ్

విక్రమ సింహ రిలీజ్

ఇప్పటికే విడుదలైన ‘విక్రమ సింహ' ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేసింది. దీపావళి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Superstar Rajinikanth is not only popular in Tamil Nadu, but also has a huge fan following in Andhra Pradesh. His last outing Robot, the dubbed version of Endhiraan, has superhit movie at the AP Box Office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu