కళ్యాణ్ రామ్ ‘ఓం’ రీమేక్ ప్లాన్లో రజనీకాంత్
కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఈచిత్రం స్పెషల్ షోను ఇటీవల చెన్నైలో వీక్షించారు. ఈ చిత్రం కాన్సెప్టు, టెక్నికల్ విలువలు చాలా బాగున్నాయని రజనీ ప్రసంశించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా తన అల్లుడు ధనుష్‌తో తమిళంలో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట.
టెక్నికల్ వ్యాల్యూస్ తో రాజీ పడకుండా తనే ఈచిత్రాన్ని నిర్మించే యోచనలో ఉన్నాడట రజనీ. ఈ మేరకు 'ఓం' చిత్రం రీమేక్ రైట్స్ విషయమై కళ్యాణ్ రామ్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
కాగా...జూన్ చివరి వారంలో 'ఓం' చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్‌టేలర్, మార్కస్, మజ్డోవిన్‌స్కీ, ఫైట్స్: విజయ్, రవివర్మ, సంగీతం: అచ్చు, సాయికార్తీక్.


Click it and Unblock the Notifications












