Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజినీకాంత్ అభిమానుల నిరసన: నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని యూనివర్శల్ స్టార్ అయిపోయారు సూపర్ స్టార్ రజినీకాంత్. వినూత్న శైలి, విలక్షణ నటనతో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఆరుపదుల వయసులోనూ ఏమాత్రం విశ్రమించకుండా సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అస్వస్థతకు గురవడం.. తర్వాత పొలిటికల్ ఎంట్రీపై తన నిర్ణయాన్ని మార్చుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఎప్పటి నుంచో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో తన అభిమాన సంఘం 'రజినీ మక్కల్ మండ్రుం' సభ్యులతో చర్చలు జరిపిన అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారాయన. అంతేకాదు, 'డిసెంబర్ 31న పార్టీ ప్రకటన.. జనవరి 1 నుంచి ప్రారంభించబోతున్నాం' అని ఓ ట్వీట్ కూడా చేశారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే అస్వస్థతకు గురయ్యారాయన. అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన తర్వాత పొలిటికల్ ఎంట్రీపై కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. దీనికి వాళ్లంతా అడ్డు చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు మరో ప్రకటనను కూడా వదిలారు.
రాజకీయాల్లోకి రావడం లేదంటూ రజినీకాంత్ చేసిన ప్రకటనపై ఆయన అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు చైన్నైకి తరలి వస్తున్నారు. అంతేకాదు, నగరంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు.