»   » రోబో 2.0 సెట్లో గాయపడ్డ రజినీ... హాస్పిటల్ కి తరలింపు

రోబో 2.0 సెట్లో గాయపడ్డ రజినీ... హాస్పిటల్ కి తరలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోబో 2.0 సినిమా షూటింగ్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. కీల‌క పోరాట స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తుండ‌గా ర‌జనీ కాలికి స్వ‌ల్ప గాయ‌మైంది. దీంతో ఆయ‌న‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స తీసుకున్న అనంత‌రం ఆయన ఇంటికి చేరుకున్నారు. షూటింగ్‌లో ర‌జనీకాంత్ గాయ‌ప‌డ్డార‌ని తెలుసుకున్న అభిమానులు ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఆయ‌న క్షేమ స‌మాచారాలు తెలుసుకునేందుకు ఆరాటప‌డుతున్నారు. ఆయన కుడికాలికి గాయమైందని, కుట్లు వేసిన పంపామని, ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, షూటింగ్ లో భాగంగా, ఆయనకు గాయాలయ్యాయని, ఆసుపత్రికి తరలించారని తెలుసుకుని వేలాది మంది అభిమానులు కేలంబాక్కంలోని రజనీని తరలించిన ప్రైవేటు ఆసుపత్రి వద్దకు చేరి, ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.

 Rajinikanth gets injured on the sets of 2.0

రజినీకి అనారోగ్యంతో ఇప్పటికే రెండు సార్లు షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. మే నెలలో ఒకసారి రజినీ అనారోగ్యానికి గురి కాగా.. ఏకంగా రెండు నెలల పాటు షూటింగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరోసారి చెకప్ ల కోసం అక్టోబర్ లో దాదాపు రెండు వారాలకు పైగా 2.0 వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా షూటింగ్ స్పాట్ లోనే రజినీకాంత్ గాయపడ్డం.. సీరియస్ న్యూస్ అయిపోయింది. 2.0 షూటింగ్ లో భాగంగా ఓ కీలకమైన సీన్ తీస్తున్న సమయంలో.. రజినీ కుడి కాలికి తీవ్ర గాయమైందిట. వర్షం పడుతుండడంతో.. మెట్లపై నడుస్తున్న సమయంలో పడిపోయారట రజినీ. అప్పటికప్పుడే సూపర్ స్టార్ ని హాస్పిటల్ కి తరలించినా.. అటు నుంచి అటే ఇంటికి వెళ్లిపోయారట రజినీకాంత్.

English summary
Superstar Rajinikanth reportedly fell and hurt one of his knees while shooting for his much-awaited upcoming Tamil science-fiction action-thriller 2.o in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu