»   » రజనీకి....వచ్చే నెలలో స్పెషల్ మేకప్ టెస్ట్

రజనీకి....వచ్చే నెలలో స్పెషల్ మేకప్ టెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : బ్యాంకాక్ లో బిజీగా "కబాలి", షూటింగ్ లో ఉన్నారు రజనీకాంత్. అయితే ఆయన వచ్చే నెలలో ఖాళీ చేసుకుని స్పెషల్ మేకప్ టెస్ట్ కోసం చెన్నై వస్తున్నారు. గతంలో చేసిన రోబో చిత్రం సీక్వెల్ కోసం ఆయన ఈ మేకప్ టెస్ట్ లో పాల్గొంటున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం.

విక్రమ్ తో చేసిన 'ఐ' సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో తో దర్శకుడు శంకర్, ఇప్పుడు తనని తానూ ప్రూవ్ చేసుకోవటానికి మరో భారీ సినిమాకు రెడీ అవుతున్నాడు. అందుకోసం ఇప్పటికే శివాజీ, రోబో లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన రజనీకాంత్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు.

Rajinikanth gets ready for make-up test for ‘Robo- 2’

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా 2016 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. రోబో 2కు కావాల్సిన మేకప్ టెస్ట్ లో పాల్గొననున్నాడు సూపర్ స్టార్. అవతార్, ఐ లాంటి భారీ చిత్రాలకు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసిన సీన్ ఫుట్ రజనీకి మేకప్ టెస్ట్ చేయబోతున్నాడు.

హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రోబో, బాహుబలి సినిమాలకు గ్రాఫిక్స్ సూపర్ వైజర్ గా పనిచేసిన శ్రీనివాస మోహన్ మరోసారి గ్రాఫిక్స్ బాధ్యతలు తీసుకున్నాడు. దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

English summary
Superstar Rajinikanth, who is currently shooting in Bangkok for his upcoming Tamil film “Kabali”, will undergo special make-up test for the sequel to blockbuster “ROBO” next month.
Please Wait while comments are loading...