»   » అసలు కారణం ఇదీ: యుఎస్ లో ప్రెవేట్ హాస్పటిల్ లో రజనీ, మేకప్ ఇష్యూ

అసలు కారణం ఇదీ: యుఎస్ లో ప్రెవేట్ హాస్పటిల్ లో రజనీ, మేకప్ ఇష్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: యుఎస్ కు వెళ్లిన రజనీకాంత్ అక్కడ ఓ హాస్పటిల్ లో ఉన్నారని తమిళ సినీ వర్గాలు నుంచి వార్తలు వినపడుతున్నాయి. అయితే ఆరోగ్య సమస్యలతో కాదు,మేకప్ టెస్ట్ కోసమని తెలుస్తోంది. రోబో 2 లో కనిపించబోయే ఓ వెరైటీ గెటప్ కోసం యుఎస్ లోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో మేకప్ టెస్ట్ లు చేయించుకుంటున్నారు. డాక్టర్స్ పర్యవేక్షణలో ఆ మేకప్ టెస్ట్ చేస్తున్నారని, ఆయనకు ఆరోగ్య కారణాలు రీత్యా..ఆ గెటప్ ఆయకు సెట్ అవుతుందనిపిస్తేనే ఓకే చేస్తారు. వయస్సు, హెల్త్ కారణాలతో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.

వాస్తవానికి జూలై 1న కబాలి చిత్రాన్ని విడుదల చేసి, జూన్ 12న ఆడియో వేడుక నిర్వహించాలని నిర్మాతలు భావించారు. కాని ఆడియోను నేరుగా మార్కెట్ లో విడుదల చేయాలనే నిర్ణయాన్ని దర్శక నిర్మాతలు తీసుకున్నారు. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కబాలి చిత్రానికి ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తే అభిమానులలో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాని చిత్ర యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయం రజనీ అభిమానులకు కాస్త నిరాశకు గురి చేసిందనే చెప్పవచ్చు.

Rajinikanth Hospitalised in US for Make Up Issue?

అయితే ఎందుకు ఆడియోని వద్దనుకున్నారు అంటే ...రజనీ తన కుటుంబ సభ్యులతో కలిసి యుఎస్ కు వెళ్లారు. అక్కడ ఓ 15 రోజుల పాటు ఉండబోతున్నారు. అయితే కబాలి ఆడియోకు ఆయన వస్తారు అని ఆశిస్తే...ఆయన యుఎస్ కు వెళ్లి అక్కడే ఉండటం ఏమిటి ..అంత ఇంపార్టెంట్ పనులు ఏం చేస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. దాంతో ఈ కారణం బయిటకు వచ్చింది.

ఇక మేడే నాడు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో విడుదలైన కబాలి టీజర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ టీజర్ ని ఇప్పటి వరకు 20 మిలియన్ల కన్నా ఎక్కువ మందే చూడటం జరిగింది. ఈ టీజర్ తో రజనీ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకోవడమే కాక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇంత వరకు ఏ చిత్ర టీజర్ కు ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదని చెప్తున్నారు.

మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కబాలి చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించాడు . ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రజనీకు ఒక్క తమిళనాటే కాక ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండడంతో ఈ సినిమాను వీలైనంత మేరకు అన్ని ఏరియాల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన రజనీ చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ చెక్కు చెదరని క్రేజ్ రజనీ సొంతం కావడంతో తలైవా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు .

English summary
Tamil Superstar Rajinikanth is undergoing make-up tests for one of his get ups at a private hospital in America.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu