»   » రజనీ ఎవరిని కలిసారో తెలిస్తే...నిజమా అని మీరు ఆశ్చర్యపోతారు

రజనీ ఎవరిని కలిసారో తెలిస్తే...నిజమా అని మీరు ఆశ్చర్యపోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ ప్రత్యేకంగా ఓ అమ్మాయిని కలవాలనుకున్నారు. ఎంక్వైరీ చేసారు. ఆమె ఎడ్రస్ పట్టుకుని, ఆమెని తన ఇంటికే పిలిపించి కలిసారు. ఎవరా అమ్మాయి..సూపర్ స్టార్ దృష్టిలో పడటానికి ఆమె ఏం చేసింది. తెలుసుకోవాలని ఉందా అయితే చదివేయండి మరి..

రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏజ్ లో కూడా ఆయన తాజా చిత్రం కబాలికు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా కబాలి చిత్రం ట్రైలర్..అందులో డైలాగులు సూపర్ హిట్. ఒక్క ట్రైలర్ తోనే కొన్ని కోట్ల మందిని ధియేటర్ వైపు పరుగెత్తేలా చేసారు నిర్మాతలు.

Rajinikanth meets the 'Pondatti da' dubsmash woman

అలాగే ఆ ట్రైలర్ విడుదలైనప్పుడు ట్రైలర్ లో డైలాగులని డంబాష్ చేస్తూ ఎన్నో వీడియోలు వచ్చాయి. అయితే ఓ వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుని కొన్ని లక్షల వ్యూస్ తెచ్చుకుంది. పొండాట్టిదా అనే పేరుతో వచ్చిన ఆ డంబాష్ లో ఈ క్రింద ఫొటోలో చూపెట్టే ఆమె పాతకాలం భార్యకు, మోడరన్ వైఫ్ కు మధ్య తేడాని డైలాగుగా చెప్పి అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఇదో సంచలనం.

ఇక ఈ వీడియో సంచలనం అక్కడితో ఆగలేదు. సూపర్ స్టార్ దృష్టికి వెళ్లింది. ఆయన ఆమెను చూడాలనుకున్నారు. తన అల్లుడు ధనుష్ ఇంట్లో ఉంటున్న ఆయన డాక్టర్ల సూచన మేరకు ఎవరినీ కలవటం లేదు. కానీ ఆమెను మాత్రం పిలిపించుకుని ,మెచ్చుకుని మాట్లాడి పంపారు. ఇక ఆ అమ్మాయి ఆనందానికి అంతేముంది చెప్పండి.

Rajinikanth meets the 'Pondatti da' dubsmash woman

అసలు ఆ ఐడియా ఎలా వచ్చిందని, ఆ వీడియో చూసి ఆమె బంధువులు ఏమన్నారు, ఆమె ఏం చేస్తూంటుంది. కుటుంబ నేపధ్యం ఏమిటి వంటి విషయాలు కనుక్కున్నారు. ఆమెతో ఓ ఫొటో కి ఫోజ్ కూడా ఇచ్చారు. అదండి విషయం .టాలెంట్ ఎప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉంటుంది.

English summary
Superstar Rajinikanth has voluntarily invited a person to his place of stay and also posed for a photograph with her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu