»   » రజనీకాంత్ నెక్ట్స్ చిత్రానికి డైరక్టర్ ఎవరంటే...

రజనీకాంత్ నెక్ట్స్ చిత్రానికి డైరక్టర్ ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని డైరక్ట్ చేయాలని అందరి డైరక్టర్స్ ఆశ ఉంటుంది. అయితే ఏ కొద్ది మందికో ఆ కోరిక నెరవేరుతుంది. తాజాగా గజనీతో స్టార్ డైరక్టర్ అయిన మురగదాస్ ని ఆ అదృష్ఠం వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రజనీతో రెండు సార్లు చర్చలు జరగాయని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో చిత్రం రిలీజ్ కు రెడీ కావటంతో రజనీ తన తదుపరి చిత్రం ఏమిటి..ఎవరితో చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే పెరిగిన ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా ఆ రేంజి దర్శకుడు అయితే కానీ వర్కవుట్ కాడని ఆయన నిర్ణయించుకున్నారు. అలాగే తన తదుపరి చిత్రంగా 1995లో నటించిన బ్లాక్‌బ్లస్టర్‌ మూవీ బాషాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. రజనీ ఆటో డ్రయివర్‌గా, అండర్‌ వరల్డ్‌ డాన్‌గా రెండు పాత్రల్లో చేసిన భాషా చిత్రం ఇప్పటికీ స్క్రీన్ ప్లే కి లెస్సన్ గా మారి ఎన్నో చిత్రాలకు మాతృ చిత్రంగా మిగిలింది. నగ్మా హీరోయిన్ చేసిన ఈ చిత్రాన్ని సురేష్‌ కృష్ణ దర్శకత్వంలో సత్యా స్టూడియోస్‌ పతాకంపై మాజీ మంత్రి ఆర్‌. ఎం.వీరప్పన్‌ నిర్మించారు. అయితే మురగదాస్ ని ఫైనల్ చేయలేదని, సూర్యతో సింగం(యముడు) చిత్రం తీసి విజయం సాధించిన దర్శకుడు హరి కూడా ఈ డైరక్షన్ రేసులో ఉన్నట్లు వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu